Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభకృతు నామ సంవత్సరం, తెలుగు సంవత్సరాల్లో 36వ సంవత్సరం... ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:33 IST)
శుభకృతు నామ తెలుగు సంవత్సరం ఏప్రిల్ 2న ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాల వరసలో 36వ సంవత్సరం ఈ శుభకృతు నామ సంవత్సరం. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.

 
ఈ ఉగాది శుభకృతు నామ సంవత్సర ఉగాదిగా పిలువడుతుంది. ఈ రోజున... అంటే ఏప్రిల్ 2న శుభకృతు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.  ముందుగా చెప్పుకున్నట్లు అభ్యంగన స్నానం చేసిన తర్వాతే ఉగాది పచ్చడి తయారుచేయాలి. ఈ ఉగాది పచ్చడిని భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ పచ్చడి తీసుకుంటూ ‘శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం’ అనే శ్లోకాన్ని చదువుతూ సేవించాలి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే... వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని మనం కోరుకుంటూ ఉగాది నాడు ఆ దేవుని శుభాశీస్సులు కోరుకోవడం అన్నమాట. 

 
ఉగాది పూజ అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, వేప పువ్వు చేదు, మామిడి పిందె వగరు, కొత్త బెల్లం తీపి, కొత్త చింతపండు పులుపు, పచ్చిమిర్చికారం, ఉప్పు. మామిడి పిందెలు తినాలి అనే సాంప్రదాయము ఉండటము మనము గమనిస్తే ఆ కాలములో వచ్చే కాయలను, పండ్లను తినడము ఆరోగ్యానికి మంచిదన్నది పెద్దల మాట.

 
ఉగాది పండుగనాడు భద్రాద్రి శ్రీరామచంద్ర మూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని, శ్రీరాముని ఆరాధన, రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరులో అల్‌ఖైదా కదలికలు.. మద్దతుదారు అరెస్టు

భాగ్యనగరిలో కుండపోత ... నీట మునిగిన హైదరాబాద్ నగరం

లైంగిక సమ్మతికి 18 యేళ్లు నిండాల్సిందే : కేంద్రం స్పష్టీకరణ

నిండు ప్రాణం తీసిన స్కూటర్ పార్కింగ్ గొడవ - మృతుడు హీరోయిన్ కజిన్

EAGLE: డ్రగ్స్ తీసుకున్న 32 మంది విద్యార్థులు.. వీరు మెడికల్ కాలేజీ విద్యార్థులు తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ పౌర్ణమి.. శివాలయంలో దీపదానం చేస్తే ఆ బాధల నుంచి విముక్తి?

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments