Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినండి.. దోషాలను తొలగించుకోండి!

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2015 (17:25 IST)
వసంత ఋతువు వచ్చేసింది. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేస్తాయి. కోయిలలు కుహు... కుహు రాగాలు పాడుతుంటాయి. ఇటువంటి వసంత ఋతువు ప్రారంభమయ్యేది చైతన్యశుద్ధ పాడ్యమినాడు. ఆ రోజున అశ్వినీ నక్షత్రం ఉంటుంది. 
 
మాసాల్లో చైత్రం, తిథుల్లో పాడ్యమి, నక్షత్రాల్లో అశ్విని మొదటిది. అంటే ఉగాది ...కాలచక్రం ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజన్నమాట. అందుకే, ఇది కాలానికి సంబంధించిన అతిముఖ్యమైన పండుగ. ఉగాది తెలుగువారు కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటారు.
 
కొత్త ఏడాదికి ప్రారంభ దినమైన ఈరోజున వేకువ జామున లేచి నువ్వుల నూనె రాసుకుని తలంటుస్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి నగలు, ఆభరణాలు ధరించాలి. తర్వాత మామిడి, వేప ఆకులతో ఇంటికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవలసింది ఉగాది పచ్చడి.
 
ఉగాది నాడు వేపపువ్వు, బెల్లం, మామిడి, చింత, ఎండు మిరప ఇలా చాలా వాటిని కలిపి పచ్చడి తయారు చేసుకుని స్వీకరించాలి. ఇలా షడ్రుచులు కలుపుకొని పచ్చడి చేయడంలో కూడా అర్థముంది. బెల్లం అంటే తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకూ, విజయానికి సంకేతం. వేప అంటే చేదు దుఃఖానికీ, నష్టానికీ, ద్వేషానికీ అపజయానికీ సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడానికి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.
 
ఉగాది నాటి సాయంత్రం తప్పక చేయాల్సింది పంచాంగ శ్రవణం. ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు ఉండే పంచాంగ శ్రవణం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ ఉగాదిన మనం మన్మథ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. మన పెద్దలు చెప్పిన ప్రకారం ఉగాదిని ఆచరిస్తే ఆయురారోగ్యాలూ వస్తాయి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

Show comments