Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ పూర్ణిమ.. తులసీ దళాన్ని మరిచిపోవద్దు..

రాఖీ పౌర్ణమినే శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆ శ్రావణ పూర్ణిమ (ఆదివారం 26 ఆగస్టు 2018) రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయి. తులసి మొక్క ఇంట వుంటే క్షుద్ర శక్తుల బాధ వుండ

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (13:25 IST)
రాఖీ పౌర్ణమినే శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆ శ్రావణ పూర్ణిమ (ఆదివారం 26 ఆగస్టు 2018) రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయి. తులసి మొక్క ఇంట వుంటే క్షుద్ర శక్తుల బాధ వుండదని నమ్మకం. అలాంటి తులసీ దళంతో శ్రావణ పూర్ణిమ రోజున సత్యనారాయణ స్వామిని అర్చించిన వారికి సకల సంతోషాలు చేకూరుతాయి. 
 
తులసీ దళాలతో నారాయణ స్వామి అయిన సత్యనారాయణ స్వామిని అర్చిస్తే.. ఈతిబాధలుండవు. శ్రీ మహా విష్ణువు తులసీ మాల ధరించడం ద్వారానే దామోదరుడైనాడని పండితులు చెప్తుంటారు. దేవతా నామ సంఖ్యాజపములకు తులసీ మాల వాడటం విశేషం. తులసీ దళాలు భక్తులకు తీర్థ ప్రసాదాలుగా ఇస్తారు. ఇది అనారోగ్యాలు దూరం చేస్తుంది. 
 
తులసీ చెట్టు విష కీటకాలను ఇంట్లోకి చేరనివ్వదు. తులసి దళము కంటికి తెలియని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. తులసీ ఆకు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. తులసి నారాయణునికి అతి ప్రీతిపాత్రమైంది. 
 
జపతపాదులు నిర్వహించేవారికి తామర, రుద్రాక్ష పూసల కంటే తులసీ మాల శ్రేష్ఠమైనది. ఇది శరీరంపై ధరించడం ద్వారా సత్వగుణంతో పాటు ఆరోగ్యప్రదం చేకూరుతుంది. అందుకే తులసీ దళాలతో నారాయణ స్వామిని అర్చించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
కార్తీక పౌర్ణమి రోజున లేదా శ్రావణ పూర్ణిమ నాడు సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. త్రిమూర్తి స్వరూపమైన సత్యనారాయణ స్వామి రామావతారంలో తన భక్తుడైన 'రత్నాకరుడు'కి ఇచ్చిన మాట కోసమే 'అన్నవరం'లోని రత్నగిరిపై ఆవిర్భవించాడు.
 
భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామి, భక్తుల కష్టనష్టాలను తీరుస్తూ సత్యమహిమ కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చని పండితులు చెబుతున్నారు. 
 
సత్యనారాయణస్వామి వ్రతాన్నే సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. ఒకసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరవలసిందే. వాయిదా వేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందనేది ఆ వ్రత కథల్లోనే కనిపిస్తుంది. అంకితభావంతో... నియమనిష్టలతో ఈ వ్రతం చేసినవారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
 
సమస్త దోషాల నుంచి ... సమస్యల నుంచి బయటపడేసే ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే కార్తీకమాసంలో చేయడం వలన కలిగే ఫలితం విశేషమైనది. కార్తీక పౌర్ణమి రోజున లేదా శ్రావణ పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో వున్నారు.. జగన్

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

వెర్రిమొర్రి పిందెల్లారా, అతి భారీ వర్షం కురిస్తే అమరావతి మాత్రమే కాదు, ముంబై, హైదరాబాద్ కూడా జలమయం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

shravan masam, శ్రావణ మాసంలో ఆడవారి ఆటలు చూడండి (video)

11-08-2025 సోమవారం ఫలితాలు - సంతోషకరమైన వార్తలు వింటారు...

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

తర్వాతి కథనం
Show comments