Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం విశిష్టత.. రుద్రాభిషేం చేయిస్తే..?

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (09:27 IST)
కార్తీకమాసానికి ప్రత్యేకత వుంది. శివకేశవులకు కార్తీక మాసం ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఉపవాసం చేసి.. రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.  ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే. 
 
అలాగే కొన్ని రోజులకు విశేష ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. 
 
ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. 
 
ఈ మాసంలో శివునికి రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరపడం మంచిది. ఉపవాసం, స్నానం, దానం మరవకూడదు. అలాగే విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి.
 
రోజూ ఇంటి ముంగిట దీపం వెలిగించడం.. ఆలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే పుణ్యఫలం చేకూరుతుంది. అలాగే కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala: మహిళను నిప్పంటించి హత్య.. నిందితుడు కూడా మృతి.. ఎలా?

Isro: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ మాడ్యుల్ నమూనా ప్రారంభించిన ఇస్రో

Godavari : భారీ వర్షాలు- ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణానదులు

నా తండ్రి హెల్మెట్ ధరించి వుంటే ఇంత జరిగేది కాదు.. హోంగార్డు కుమారుడి సందేశం వైరల్

Telanagana doctor posts: తెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesha Idol: అనకాపల్లిలో 126 అడుగుల లక్ష్మీ గణపతి ఏర్పాటు

21-08-2025 రాశి ఫలితాలు.. ఈ రాశికి ఈ రోజు నిరాశాజనకం

121 kg gold: 121 కేజీల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

Pradosha Vratham: 12 సంవత్సరాల పాటు ప్రదోష వ్రతం పాటిస్తే ఏమౌతుందో తెలుసా?

Saumya pradosh: బుధవారం ప్రదోషం.. శివాలయాల్లో సాయంత్రం పూట ఇలా చేస్తే?

తర్వాతి కథనం
Show comments