Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి కల్యాణోత్సవం జరిపించండి.. వివాహ అడ్డంకులు, రాహు, కేతు దోషాల్ని తొలగించుకోండి..!

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సర్వశుభాలు చేకూరుతాయని అందరి నమ్మకం. తిరుమల కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడి దర్శనంతో పాటు ఆయనకు జరిగే ఆర్జిత సేవలు, కల్యాణోత్సవాలు దర్శించుకునే వారికి

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (14:10 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సర్వశుభాలు చేకూరుతాయని అందరి నమ్మకం. తిరుమల కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడి దర్శనంతో పాటు ఆయనకు జరిగే ఆర్జిత సేవలు, కల్యాణోత్సవాలు దర్శించుకునే వారికి సైతం అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వర స్వామిగా తిరుమల కొండలపై స్వయంభువుగా అవతరించినట్లు భవిష్యోత్తర పురణాంతో పాటు వేంకటాచల మహాత్మ్యం చెప్తోంది. అలాంటి పవిత్రమైన శ్రీవారి ఆలయం నిత్యకల్యాణం .. పచ్చతోరణంగా ఉంటుంది. 
 
అసలే వైభవంతో వెలుగొందే స్వామి .. అలాంటి ఆయన కల్యాణోత్సవం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. స్వామి కల్యాణోత్సవాన్ని తిలకిస్తే ఆ జన్మ ధన్యమైనట్లేనని పండితులు చెప్తున్నారు. అందుకే తిరుమలలో శ్రీవారికి కల్యాణం జరిపించేందుకు భక్తులు పోటీపడుతుంటారు. శ్రీవారి సమేత అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని జరిపించే వారికి సమస్త కష్టాలు తొలగిపోతాయి. దోషాలు, పాపాలు, నశించిపోతాయి. 
 
దారిద్ర్యము, దుఃఖము దూరమవుతుంది. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఇంకా చెప్పాలంటే.. స్వామివారి కల్యాణాన్ని చేయించినవారికి ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో, చూసినవారికి సైతం అంతటి పుణ్యఫలం లభిస్తుందని స్పష్టమవుతోంది. ఇలా నిత్యకల్యాణం వల్లనే శ్రీవారికి కల్యాణచక్రవర్తి అనే పేరు సార్థకమైంది. వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే శ్రీవారి కళ్యాణోత్సవాన్ని చూసి తరించాల్సిందే. 
 
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షిస్తే.. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే శ్రీవారికి కళ్యాణోత్సవం చేయిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేగాకుండా కుజ, రాహు దోషాలు తొలగిపోతాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయని పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments