Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు రోజులు... ఏయే దేవతలను పూజించాలి... ఆదివారం సూర్యుడిని?

వారానికి ఏడు రోజులు. అయితే ప్రతీ రోజుకీ ఓ ప్రత్యేకత ఉంది. పంచాంగం ప్రకారం ప్రతీ రోజుకీ ఓ దేవుడు అధిపతిగా ఉంటాడు. ఆ రోజున ఆ దేవుడికి పూజ చేసుకుంటే కార్యసిద్ధి చేకూరుతుంది. దైవానుగ్రహం లభిస్తుంది. ఏయే ర

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (15:20 IST)
వారానికి ఏడు రోజులు. అయితే ప్రతీ రోజుకీ ఓ ప్రత్యేకత ఉంది. పంచాంగం ప్రకారం ప్రతీ రోజుకీ ఓ దేవుడు అధిపతిగా ఉంటాడు. ఆ రోజున ఆ దేవుడికి పూజ చేసుకుంటే కార్యసిద్ధి చేకూరుతుంది. దైవానుగ్రహం లభిస్తుంది. ఏయే రోజున ఏ దేవుడికి పూజ చేయాలో చూద్దాం.. సోమవారం శివునికి విశిష్టమైన రోజు. ఆ రోజున నీలకంఠేశ్వరుడిని పూజించాలి. శివునికి సోమవారం పూట పాలు, బియ్యం, పంచదారతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి.. పూజ చేయడం ద్వారా సర్వేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అంటున్నారు.. పండితులు.
 
ఇక మంగళవారం పూట హనుమంతుడిని పూజించాలి. దుర్గాదేవిని కూడా పూజించవచ్చు. మంగళవారం పూట వ్రతమాచరించి రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయతో దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం పూర్తవుతాయి. బుధవారం పూట వినాయకుడిని పూజించాలి. విఘ్నేశ్వరుడికి గరిక సమర్పించి పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. గురువారం విష్ణు భగవానుడిని, సాయిబాబాను, లక్ష్మీదేవి, రాఘవేంద్ర  స్వామిని పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా దక్షిణామూర్తి (గురు భగవానుడిని) పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. 
 
శుక్రవారం పూట దుర్గాదేవిని, రాజరాజేశ్వరిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ఇక శనివారం పూట శని భగవానుడికి దీపం వెలిగించాలి. ఆంజనేయుడు, కాళీదేవతను  పూజించవచ్చు. ఆదివారం పూట నవగ్రహాల్లో అగ్రజుడైన సూర్య భగవానుడిని స్మరించుకోవాలి.  సూర్య దోషం ఉన్నవారు ఈ రోజున వ్రతమాచరించి సూర్యుడిని ప్రార్థిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments