Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

సెల్వి
గురువారం, 7 ఆగస్టు 2025 (15:03 IST)
Raksha Bandhan 2025
రాఖీ పండుగ 2025 విశిష్టమైనది. ఈ రోజున అరుదైన మహా సంయోగం ఏర్పడబోతుంది. 1930 తర్వాత ఈ ఏడాది 2025లో రాఖీ పండుగ రోజున ఈ యోగం ఏర్పడుతోంది. ఈ ఏడాది రాఖీ పండగ రోజు ఇతర శుభ యోగాలు కూడా ఉన్నాయని పండితులు అంటున్నారు. 
 
ఈ రాఖీపండుగ రోజున లక్ష్మీ నారాయణుడిని పూజించి రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. రాఖీ పండుగ రోజున సౌభాగ్య యోగం కూడా ఏర్పడనుంది. ఇది ఆగస్టు 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంటుంది. అనంతరం శోభన యోగం ఏర్పడుతుందట. అంతేకాకండా ఆగస్టు 9వ తేదీన ఉదయం 5:47 గంటల నుంచి మధ్యాహ్నం 2:23 గంటల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. 
 
మరోవైపు శ్రవణ నక్షత్రం సైతం మధ్యాహ్నం 2:23 గంటల వరకు ఉంటుంది. ఇవన్నీ గమనిస్తే 95 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ ఒకే తేదీ, ఒకే రోజు, ఒకే సమయం, ఒకే నక్షత్రం, ఒకే యోగాలు ఏర్పడటం గమనార్హం. అందుకే ఈ రోజున సత్యనారాయణ స్వామిని, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. 
 
రాఖీ పౌర్ణమి రోజు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు మాత్రమే వేయడం శుభప్రదం అని చెబుతారు. అందులో మొదటి ముడి తన సోదరుడికి దీర్ఘాయుష్షు ప్రసాదిస్తుందని. రెండో ముడి రాఖీ కట్టిన సోదరికి దీర్ఘాయుష్షు అందిస్తుందని. ఇక మూడో ముడి వారి అనుబంధంలో మాధుర్యాన్ని పెంచుతుందని నమ్మకం.
 
పంచాగం ప్రకారం ఈ ఏడాది రాఖీ 2025 శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం 2.12 గంటలకు ప్రారంభం అవుతుంది. అనంతరం ఆగస్టు 9న మధ్యాహ్నం 1.24 గంటలకు శ్రావణ పౌర్ణమి తిథి ముగుస్తుంది. కాబట్టి రాఖీ పండుగను ఆగస్టు 9వ తేదీన నిర్వహించుకుంటారు. కాబట్టి ఆగస్టు 9, 2025 శనివారం రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం 5:47 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. ఈ సమయంలో రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట

తర్వాతి కథనం
Show comments