Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాల్గుణ పౌర్ణమి.. ఉసిరికాయ దీపం.. ఈ రాశుల వారికి అదృష్టమే.. (video)

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (15:05 IST)
కార్తీకమాసం దీపాలకు, దీపారాధనకు వైశిష్ట్యమైనది. మాఘ మాసం పవిత్ర, పుణ్యస్నానాలకు శుభకరం. అలాగే ఫాల్గుణ మాసం.. విష్ణువుకు ప్రీతికరమైన మాసం ఈ మాసం విష్ణుమూర్తిని ఆరాధించే వారికి సకలసంపదలు చేకూరుతాయి. నవగ్రహాల్లో సూర్యుడు శ్రేష్టమైన వాడో, నక్షత్రాల్లో చంద్రుని గొప్ప విశిష్టత వుంటుంది. అలా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టమైనది. 
 
ఫాల్గుణ మాసంలో వచ్చి పౌర్ణమి రోజున ఉసిరికాయతో విష్ణుమూర్తి దీపం వెలిగించాలి. ఈ నెల 20వ తేదీన ఫాల్గుణ పౌర్ణమి. ఈ రోజున శుచిగా స్నానమాచరించి.. విష్ణుమూర్తిని కొలిచిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ఫాల్గుణ పౌర్ణమి రోజున జాతకాల్లో నాగ దోషాలున్నట్లు తేలితే హోమాలు జరిపించుకుంటే తొలగిపోతాయి. 
 
అంతేగాకుండా ఈ ఫాల్గుణ పౌర్ణమి కొన్ని రాశుల వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. ఈ ఫాల్గుణ పౌర్ణమికి తర్వాత కొన్ని రాశుల వారికి శుభఫలితాలు చేకూరనున్నాయి. పౌర్ణమి రోజున సాయంత్రం పూట శ్రీ మహాలక్ష్మిని పూజించినట్లైతే ఐశ్వర్యాలు చేకూరుతాయి. అమ్మవారికి ఇష్టమైన సన్నజాజి పువ్వులను మాలగా కూర్చి సమర్పించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
 
కలకండ, పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శుభఫలితాలుంటాయి. ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి. ఆపై నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 
 
ఇక ఈ ఫాల్గుణ పౌర్ణమికి తర్వాత మేష రాశికి వారికి అదృష్టం వరిస్తుంది. అలాగే మిథునరాశి వారికి కూడా ఫాల్గుణ పౌర్ణమికి తర్వాత జీవితంలో సుఖసంతోషాలు చేకూరుతాయి. ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. అనుకున్న కార్యాల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ రెండు రాశులతో పాటు సింహ రాశి వారికి శుభ ఫలితాలుంటాయి. 
 
ఇంకా ఈ రాశుల వారు ఫాల్గుణ పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. తులారాశి వారికి కూడా ఇబ్బందు తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఈ రాశుల వారు ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరి కాయతో విష్ణువుకు ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

తర్వాతి కథనం
Show comments