Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 22-10-2017

మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. బంధుమిత్రులు మీ వైఖరిని తప్పు పడతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంద

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (05:24 IST)
మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. బంధుమిత్రులు మీ వైఖరిని తప్పు పడతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. 
 
వృషభం: మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కొంటారు.
 
మిథునం: ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసివస్తుంది. బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణం తెచ్చే ప్రయత్నంలో సఫలీకృతులౌతారు. స్త్రీలకు అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వివాదాస్పదాలలో తలదూర్చకండి. సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
సింహం: రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతి లభిస్తుంది. ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలకు షాపింగ్‌ల్లో నాణ్యతను గమనించాలి. మీకు రావలసిన అవకాశాలు, పదవులు వేరొకరికి లభిస్తాయి. కొన్ని విషయాలు మరిచిపోదామనుకున్నా సాధ్యం కాదు.
 
కన్య: మీ బంధువులు, కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. ఎంత సంపాదించినా ధనం నిలబెట్టలేకపోతారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
తుల: శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారం అందిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
వృశ్చికం: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మనోసిద్ధికి ఇది సరైన సమయం అని గమనించగలరు. పొట్ట, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికం. నిరుద్యోగులు నిర్లక్ష్యం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనను క్రియారూపంలో పెట్టండి.
 
మకరం: ధైర్యంతో ముందడుగు వేసే తప్ప అది ఆనందదాయకం కాదు. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయడం మంచిదికాదు. బంధుమిత్రుల కలయిక మీకెంతో సంతృప్తికానవస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కలిసివస్తుంది. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
కుంభం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావచ్చు. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది. మీ సంతానం భవిష్యత్తు బాగుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
మీనం : స్త్రీలకు షాపింగ్‌ల్లో నాణ్యతను గమనించాలి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. కుటుంబంలో పెద్దల మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల కోసం వేచియుండక తప్పదు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments