Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 14-10-17

మేషం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మలను పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (05:55 IST)
మేషం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మలను పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది.
 
వృషభం : కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తారు. రుణ యత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. బ్యాంకు వ్యవహారాలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించకండి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
మిథునం : జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్స్‌లు మంజూరు కాగలవు. మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు.
 
కర్కాటకం : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. ఫ్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
సింహం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. అనుకున్న పనులు ఆలస్యమైనా కంగారు పడకండి. స్త్రీలు, దైవ దర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
కన్య : మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడతుంది. ఎదుటివారి తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. కష్టసమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.
 
తుల : స్థిరాస్తి క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత అవసరం. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది.
 
వృశ్చికం : వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. రవాణా, ఎగుమతి, ట్రాన్స్‌పోర్ట్ రంగాల వారికి సామాన్యం. స్త్రీల స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం.
 
ధనస్సు : విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ వహించండి. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దైవ దర్శనాలు దీక్షలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి.
 
మకరం : చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామిక చర్చల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనం నడుపుతున్నప్పడు ఏకాగ్రత అవసరం. విద్యార్థుల బజారు తినుబండరాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
కుంభం : మీడియా రంగాల వారికి పనిభారం అధికం. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. పెద్దమొత్తం నగదు సాయం క్షేమం కాదు. ఆత్మీయుల సలహా పాటించండి. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి.
 
మీనం : అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటుతగదు. పారిశ్రామికరంగాల వారికి ప్రోత్సాహకరం. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

తర్వాతి కథనం
Show comments