Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Navratri2020.. దుర్గాష్టమి రోజున 108 తామర పువ్వులు, వంద మట్టి దీపాలు..?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (05:00 IST)
నవరాత్రుల్లో ఎనిమిదో రోజున అష్టమిని దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజు చాలామంది భక్తులకు ప్రత్యేకమైనది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ప్రసాదాలను సమర్పిస్తారు. కొంతమంది భక్తులు నవరాత్రిని ఉపవాసం లేదా వ్రతాన్ని కూడా పాటిస్తారు. ఈ సంవత్సరం దుర్గాష్టమిని 2020 అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
 
అష్టమి తేదీ, సమయం, పూజ సమయాలు
అష్టమి తిథి ప్రారంభం - 06:57 ఉదయం అక్టోబర్ 23, 2020 నుంచి 
అష్టమి తిథి సమాప్తం - 06:58 ఉదయం అక్టోబర్ 24, 2020 వరకు.
 
అష్టమి రోజున వివిధ పూజ ఆచారాలు ఉన్నాయి. చాలామంది కన్యా పూజ చేస్తారు. తొమ్మిది మంది యవ్వన బాలికలను ఇంటికి ఆహ్వానిస్తారు. హల్వా, పూరీలను నైవేద్యంగా సమర్పిస్తారు. వారికి రుచికరమైన భోజనం వడ్డిస్తారు.
 
ఈ అమ్మాయిలు దుర్గాదేవి అవతారాలు అని చెబుతారు. వారి పాదాలను నీటితో కడుగుతారు, వాటిని మణికట్టు మీద ఎరుపు పవిత్ర దారం లేదా పెన్సిల్ బాక్స్, క్లిప్‌లు, వాటర్ బాటిల్స్ వంటి కొన్ని చిన్న బహుమతులు కూడా బాలికలలో పంపిణీ చేస్తారు. 
 
ఆలయాల్లో దుర్గాష్టమి రోజున వంద లేదా 8 మట్టి దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే దుర్గాదేవికి 108 తామర పువ్వులు, బిల్వ పత్రాలు సమర్పించాలి. ఈ రోజున మధ్యాహ్నం పూట అన్నదానం చేయడం చేయాలి. అన్నదానంలో చన్నాదాల్, పన్నీర్, పలావ్, కిచిడీ, టమోటా పచ్చడి, అప్పడాలు, సలాడ్ వంటివి వుండేలా చూసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments