Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టుమచ్చల మీద వెంట్రుకలు వుంటే... పుట్టుమచ్చలు ఫలితాలు...

పుట్టుమచ్చల ఫలితాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందిలో వుంటుంది. పుట్టుమచ్చలు-ఫలితాలు గురించి చూద్దాం. * నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు. * నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (22:00 IST)
పుట్టుమచ్చల ఫలితాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందిలో వుంటుంది. పుట్టుమచ్చలు-ఫలితాలు గురించి చూద్దాం.
 
* నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు.
* నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు.
* కనుబొమ్మపై ఉంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
* ముక్కుపై ఉంటే కొంతమందిలో క్రమశిక్షణ లోపిస్తుంది. చెవికి చెందిన ఏ భాగంలో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో గౌరవంతో కూడిన గుర్తింపు ఉంటుంది.
* పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారు.
* మగాళ్లకు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చలు ఉంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.
* మగవారికి తలలో పుట్టుమచ్చలుంటే గర్వం ఎక్కువ. వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా గమనిస్తారు. మంచి ఆశాభావం గలవారు.
* పెదవిపై ఉంటే కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది. 
* బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు.
* నాలుకపై ఉంటే మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు. 
* గడ్డంపై ఉంటే ఆడ, మగ వారిలో భిన్నంగా ఫలితాలు ఉంటాయి. 
* గడ్డం మధ్యలో పుట్టు మ‌చ్చ ఉన్న మగవారు ఉదార గుణము కలిగి ఉంటారు. ఆడ వారికి భక్తిభావం మెండు. మంచి అదృష్టవంతులవుతారు.
* భుజంపై ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు. 
* మోచేయిపై ఉంటే మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.
* ఎడమ బాహుమూల భాగంలో ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి. 
* కుడి బాహుమూల భాగంలో ఉంటే భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు. 
* మెడ భాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు.
* కుడి కనుబొమ మీద మచ్చ ఉన్నవారికి వివాహము త్వరిత గతిన అవుతుంది. 
* కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉంటే సంపద కలుగుతుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. 
* మొత్తంగా ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా 
ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి.
* శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మిక ధన లాభం. 
* శరీరం వెనుక భాగంలో ఉంటే మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments