Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-05-2017 రాశి ఫలితాలు... ఆ రాశివారు తోటివారి వల్ల మాట పడక తప్పదు...

మేషం: చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. తరచూ సభలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. రాబడికి మించిన ఖర్చుల వల్ల చేబదుళ్ళు,

Webdunia
సోమవారం, 29 మే 2017 (21:59 IST)
మేషం: చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. తరచూ సభలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. రాబడికి మించిన ఖర్చుల వల్ల చేబదుళ్ళు, రుణయత్నాలు సాగిస్తారు.
 
వృషభం : పత్రిక ప్రైవేట్ సంస్థల్లోని వారికి తోటివారి వల్ల మాటపడక తప్పదు. కొంతమంది మీ ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది. ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
మిథునం : ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కర్కాటకం : కొబ్బరి, పండ్ల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల గురించి ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు.
 
సింహం : కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వడం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు నడుము, నరాల ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కన్య: ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శక్తిసామర్థ్యాలపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. మీ సంతానం ధోరణి చికాకు పరుస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు ఆటంకాలు తప్పవు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి
 
తుల: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. దైవ, సేవా పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎంత శ్రమించినా సామాన్య ఫలితాలే పొందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృశ్చికం : స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ఖర్చుల వల్ల ధనం చేతిలో నిలబడటం కష్టం. ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. 
 
ధనుస్సు : వస్త్ర, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. చిన్ననాటి మిత్రులు తారసపడుతారు. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
 
మకరం : ఎదుటివారికి మీ మాటపై నమ్మకం ఏర్పడుతుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ పట్టుదల నెరవేరుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది. బంధువుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. సాహసించి మీరు తీసుకున్న ఒక నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
మీనం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. రావలసిన ధనం అందకపోవడంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments