Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌని అమావాస్య 2023: శనివారం మౌని అమావాస్య.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి..

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (21:28 IST)
మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. అదికూడా శనివారం ఈ అమావాస్య రావడం విశేషం. ఈ రోజున నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించాలి. అలాగే దానధర్మాలు చేయాలి. మౌని అమావాస్య ఖచ్చితమైన తేదీ, స్నానానికి శుభ సమయం.. ఈ పవిత్రమైన రోజున ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం.. 
 
మాఘ మాసంలో వచ్చే మౌని అమావాస్య 2023 సంవత్సరంలో మొదటి శనిశ్చారి అమావాస్య. ఈ పవిత్రమైన రోజున ప్రజలు మౌని అమావాస్య నాడు పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఇలాచేస్తే పాపాలన్నీ హరించుకుపోతాయి. 
 
ఈ రోజున భక్తులు ఉపవాసం వుండి, నైవేద్యాలు సమర్పించడం ద్వారా, దానాలు చేయడం అసాధ్యమైన పనులను పూర్తి చేస్తుంది. 
 
పంచాంగం ప్రకారం, మాఘ మాసంలోని అమావాస్య తిథి 2023 జనవరి 21 శనివారం ఉదయం 06.17 నుండి 2023 జనవరి 22 వరకు ఉదయం 02.22 గంటల వరకు వుంటుంది.  
 
శనివారం మౌని అమావాస్య  20 ఏళ్లలో ఇదే తొలిసారి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనివారం వచ్చే అమావాస్యను శనిశ్చరి అమావాస్య అంటారు. ఈ రోజున మౌన ఉపవాసం ఉండి నైవేద్యాలు సమర్పించి, దానం చేసే వ్యక్తికి శని దోషంతో పాటు పితృదోషం, కాలసర్పదోషం నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం.
 
శనీశ్చరి అమావాస్య నాడు ఏమి దానం చేయాలి
శని అమావాస్య రోజున ఒక పాత్రలో కొద్దిగా ఆవనూనెను తీసుకుని ముఖం నీడను చూసిన తర్వాత దానం చేయండి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ సమసిపోతాయని నమ్ముతారు.  
 
రెండవది నల్ల నువ్వులను నీటిలో కలిపి రావిచెట్టుకు సమర్పించి ఆ తర్వాత నల్ల నువ్వులను దానం చేయవచ్చు. మూడవది ఆవనూనె, పెసరపప్పు, దుప్పటి, ఇనుము దానం చేసే వారు శని అనుగ్రహం లభిస్తుంది. సంపద రెట్టింపు అవుతుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments