Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా కాలభైరవ అష్టమి.. ఎప్పుడు.. ఏం చేయాలి..? మిరియాల దీపంతో..?

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (05:00 IST)
మహా కాలభైరవి అష్టమి.. కార్తీక మాసంలో వస్తోంది. ఈ నెల ఏడో తేదీ (డిసెంబర్ 7, 2020) సోమవారం ఈ కాలభైరవ అష్టమి అంటే కాలభైరవ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకునే పరమశివుని మరో రూపమే భైరవ స్వరూపం. కాలము అనే శునకాన్ని వాహనంగా కలిగి వుంటాడు కాబట్టే.. ఆయనను కాలభైరవుడు అని పిలుస్తారు.
 
 పరమ శివుడి కాలుడి స్వరూపమైన కాలభైరవుడిని కాలభైరవ జయంతిన పూజించే వారికి సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ఈ రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి, కొబ్బరి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో వున్న సమస్త గ్రహ దోషాలు తొలగి.. ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్షు పెరుగుతుంది. 
 
ఇంకా ఎనిమిది మిరియాలను ఓ తెలుపాటి గుడ్డలో కత్తి వత్తుగా చేసి.. భైరవుని తలచి రెండు దీపాలను నువ్వులతో వెలిగిస్తే.. అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. 
 
అలాగే పాలను అభిషేకానికి సమర్పించుకున్నా శని దోషాలుండవు. శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శనం చేసి.. భైరవునికి పెరుగన్నం తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

లేటెస్ట్

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

తర్వాతి కథనం
Show comments