జూన్ 20వ తేదీ దినఫలాలు... పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు...

మేషం మీ శ్రీమతి ఆరోగ్యంలో మెళకువ వహించండి. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. రాజకీయరంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. మీ సంతానం భవిష్యత్ కోసం కొత్తకొత్త పథకాలు

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (22:06 IST)
మేషం
మీ శ్రీమతి ఆరోగ్యంలో మెళకువ వహించండి. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. రాజకీయరంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. మీ సంతానం భవిష్యత్ కోసం కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు. 
 
వృషభం
ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోనివారు అచ్చుతప్పులు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. ఖర్చులు అధికమైనా సంతృప్తి. ప్రయోజనకరంగా ఉంటాయి. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
మిథునం 
కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ విషయంలో ఏకాగ్రత చాలా అవసరం. రాజకీయ నాయకులు తరచుగాసభలూ సమావేశాల్లో పాల్గొంటారు. పెద్దలు, అనుభవజ్ఞులు సలహాలు పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా గట్టెక్కుతారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేసి మంచి పేరు ఖ్యాతి గడిస్తారు. 
 
కర్కాటకం 
ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ప్రముఖుల కోసం ఆకస్మిక ఖర్చులు. తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు బంధువర్గాలు, చుట్టుపక్కలవారితో సత్సంధాలు నెలకొంటాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగస్తులు చిక్కుల్లో పడతారు. 
 
సింహం
ఉద్యోగాల్లో ఊహించని మార్పులు, ఆదాయాభివృద్ధి ఉంటాయి. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. స్థిరాస్తిని అమ్మటానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. 
 
కన్య
ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గిరికాకండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన వంటి చికాకులు అధికమవుతాయి. మీ పథకాలు, ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. 
 
తుల
వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులు గురవుతారు. 
 
వృశ్చికం 
ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచనమంచిది. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు 
మీజీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ నేతల సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
మకరం
మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలు షాపింగ్‌లో దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 
 
కుంభం 
ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్సాంతి లోపిస్తుంది. సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. కుటుంబ విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. 
 
మీనం
దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం వంటి శుభఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగిన నష్టాలు ఉండవు. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట

28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...

తర్వాతి కథనం
Show comments