Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణాష్టమి: అష్టోత్తర పూజను చేయిస్తే ఫలితం ఏమిటి?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (18:57 IST)
లోకకల్యాణార్థం మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేసిన పరమాత్మ శ్రీ కృష్ణుడిని గోకులాష్టమి రోజున దర్శిస్తే మన పాపాలు హరించిపోతాయి. 
 
హిందూమతానికి ఆదర్శప్రాయ గ్రంథమైన గీతా సారాంశాన్ని అందించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మ దినమైన శ్రీకృష్ణాష్టమి వేళ శ్రీ కృష్ణ దేవాలయాలను దర్శిస్తే జన్మ జన్మలకు సరిపోయే పుణ్యఫలం భక్తుల సొంతమౌతుంది. అందుకే కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదం. 
 
శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించిన సమయంలో కృష్ణ ధ్యాన శ్లోకములు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఆ దేవదేవుని సన్నిధిలో అష్టోత్తర పూజను చేయిస్తే చేయించిన వారికి సఖల సుఖాలు సొంతమౌతాయి. దీనితోపాటు కృష్ణ సహస్రనామ పూజను కూడా చేయిస్తే చాలా మంచిది. 
 
దేవాలయ సందర్శన వేళ శ్రీకృష్ణుని లీలా వినోద మాలిక శ్రీభాగవతం గ్రంథాన్ని కొని దాన్ని పఠించగల్గితే స్వర్గ సౌఖ్యం సొంతమౌతుంది. కృష్ణాష్ఠమి సందర్భంగా సన్నిహితులకు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందించడం శుభకరం. 
 
కృష్ణాష్టమి వేళ శ్రీకృష్ణుని దేవాలయ నిర్వాహకులు సైతం శ్రీకృష్ణుని లీలలను తెలిపే వివిధ నృత్య నాటకాలను, శ్రీకృష్ణుని చరితకు సంబంధించిన ఉపన్యాసాలను ఏర్పాటుచేస్తే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

19-05-2004 నుంచి 25-05-2024 వరకు మీ వార రాశిఫలాలు

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

Show comments