Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి తింటున్నట్టుగా కల వస్తే... ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా కలలనేవి అందరికీ వస్తుంటాయి. ఆయా కోరికలను బట్టి ఆలోచనలను బట్టి అందుకు సంబంధించిన కలలు వస్తుంటాయి. ఇక అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉన్నప్పుడు కూడా కలలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి కలలు ఫలిత

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (11:07 IST)
సాధారణంగా కలలనేవి అందరికీ వస్తుంటాయి. ఆయా కోరికలను బట్టి ఆలోచనలను బట్టి అందుకు సంబంధించిన కలలు వస్తుంటాయి. ఇక అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉన్నప్పుడు కూడా కలలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి కలలు ఫలితాలను ఇవ్వవని వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం జరుగుతుంటుంది.
 
కలలు వేరుగా వచ్చినట్టే వాటికి సంబంధించిన ఫలితాలు కూడా వేరుగానే ఉంటాయి. కొన్ని కలలు జరుగుతున్న సంఘటనను ప్రేక్షకులుగా చూస్తున్నట్టుగా వస్తుంటాయి. మరికొన్ని కలల్లో జరుగుతున్న దృశ్యంలో కల కనేవారు కూడా కనిపిస్తుంటారు. ఏదైనా మెలకువ వచ్చేంత వరకు అది కల అనే విషయం తెలియనంత సహజంగా ఉండడం కల గొప్పతనంగా చెప్పుకోవచ్చు.
 
మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా తెల్లవారు జామున వచ్చే కొన్ని కలలు మాత్రమే నిజమవుతాయని శాస్త్రం చెబుతోంది. భవిష్యత్తులో జరగనున్న కొన్ని సంఘటనలను ముందుగా తెలియజేసే సంకేతంగా కలలు వస్తుంటాయని చెబుతుంటారు. కొన్ని కలలు రానున్న ప్రమాదాలను మరికొన్ని కలలు జరగనున్న శుభాలను ముందుగా తెలుపుతుంటాయి.
 
ఈ నేపథ్యంలో వివిధ రకాల పదార్థాలు, పండ్లు తింటున్నట్టుగా కూడా కలలు వస్తుంటాయి. అలా బెల్లం తింటున్నట్టుగా గాని, మామిడి పండ్లు తింటున్నట్టుగా గాని కల వస్తే ఎదురుచూస్తోన్న శుభసమయం దగ్గరికి వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలని చెప్పబడుతోంది. ఇలా కలలో తాము బెల్లం, మామిడి పండ్లు తింటున్నట్టుగా కనిపించడం మనసులో గల కోరికలు త్వరలో నెరవేరతాయనే విషయాన్ని సూచిస్తాయని స్పష్టం చేయబడుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments