Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న కామిక ఏకాదశి: విష్ణువును పూజించి.. వెన్నను దానం చేస్తే..?

Webdunia
శుక్రవారం, 18 జులై 2014 (19:25 IST)
ఆషాఢ శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని అంటారు. దీన్నీ ప్రథమైకాదాశినాడు అని కూడా అంటుంటారు. ఆషాఢ శుద్ధ ద్వాదశినాడు చాతుర్మాస్యం ప్రారంభిస్తారు. యతులకు, సన్యాసులకు ఇది ఎంతో పవిత్రమైనది ముఖ్యమైంది. కామిక ఏకాదశి అని పిలువబడే రోజున ఆచరించే వ్రతాన్ని పాటిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతము (వెన్న)ను దానం చేయడం మంచిది.  
 
కామిక ఏకాదశి రోజున తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. తులసీ దళాలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శత్రుబాధ, ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక తులసీ దళం.. నవరత్నాలు, వజ్ర వైఢూర్యాలు, స్వర్ణం, వెండి కంటే అతీతమైందని పురాణాలు చెబుతున్నాయి. 
 
అందుచేత కామిక ఏకాదశిన సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణుపూజ, తులసీ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఆ రోజున శ్రీ కృష్ణుడిని నిష్ఠగా పూజించి నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపమెలిగిస్తే.. ఆ పరమాత్మ ఆశించిన ఫలితాలనిస్తాడని, పాపాలను హరింపజేసి, స్వర్గలోకవాస ప్రాప్తం ప్రసాదిస్తాడని పురోహితులు అంటున్నారు. 

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments