Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం పచ్చరంగు దుస్తులు ధరించండి.. యాలకుల్ని, హల్వాను?

బుధవారం పూట బుధువును పూజిస్తే ఉద్యోగ యత్నాల్లో సఫలీకృతులవుతారు. బుధగ్రహం బుద్ధికి కారకుడు. ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగల సమర్థుడు. ఇతనిని పూజిస్తే నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్త

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (12:24 IST)
బుధవారం పూట బుధువును పూజిస్తే ఉద్యోగ యత్నాల్లో సఫలీకృతులవుతారు. బుధగ్రహం బుద్ధికి కారకుడు. ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగల సమర్థుడు. ఇతనిని పూజిస్తే నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలన్నా.. ధనాన్ని పొదుపు చేయాలన్నా బుధగ్రహాన్ని పూజించాలి. బుధుడు విద్య, ధనం, వ్యాపారం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.
 
బుధవారం పూట ఉప్పు లేని ఆహారం తీసుకుని ఉపవాసం వుండి 21 లేదా 45 వారాల పాటు బుధుడిని పూజించిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. బుధవారం పూట హల్వాను ఇతరులకు దానంగా ఇవ్వాలి. యాలకులను బుధగ్రహానికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజున పచ్చ రంగు దుస్తులను ధరించాలి. చివరి వారం రోజున పండితులకు తీపి పదార్థాలను దానంగా ఇవ్వాలి. 
 
అలాగే కేతువును పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని.. దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలు ఏర్పడుతాయి. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు. ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతాన ప్రాప్తి చేకూరుతుంది. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు. ఇతనిని పూజిస్తే బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.
 
ఇక కుజుడిని ప్రార్థిస్తే మనస్తాపాలు తొలగిపోతాయి. ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని పెంచుతాడు. శరీర కండరాల్లో ఏర్పడే రుగ్మతలను దూరం చేస్తాడు. 
 
గురువును ఆరాధిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక గ్రహం శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే అనుభవాన్ని నేర్పిస్తాడు. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించేలా చేస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో వృషభరాశికి విద్యా జాతకం ఎలా వుంటుంది..?

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments