Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవగ్రహాలను ఎన్నిసార్లు చుట్టాలి? నవగ్రహాలు యోగాన్ని ప్రసాదిస్తాయా?

నవగ్రహాలను ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలని తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. నవగ్రహాలను తొమ్మిదిసార్లు చుట్టి.. ఆపై ఒక్కో గ్రహానికి ప్రత్యేకించి ప్రదక్షణలు చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చునని జ్యోతిష్

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (12:22 IST)
నవగ్రహాలను ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలని తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. నవగ్రహాలను తొమ్మిదిసార్లు చుట్టి.. ఆపై ఒక్కో గ్రహానికి ప్రత్యేకించి ప్రదక్షణలు చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నవగ్రహాలను ప్రదక్షణలు చేయడం మంచిదే అయినప్పటికీ.. గుడికి వెళ్లి నేరుగా నవగ్రహాల వరకే చుట్టడం మాత్రం మంచిది కాదు.
 
ఏదైనా గుడికి వెళితే.. ఆలయంలోని మూల విరాట్‌ను దర్శించుకున్నాకే నవగ్రహాలను ప్రదక్షించడం చేయాలి. ఉట్టి నవగ్రహాల వరకే ప్రదక్షణలు చేసే విధానం సరికాదు. నవగ్రహాలకు సూర్యుడు నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఇరు చేతుల్లో తామర పూవులను ధరించి, కుడివైపు ఉష, ఎడమ వైపు ప్రత్యూష అనే ఇరు భార్యలతో.. ఏడు అశ్వాల రథంపై సూర్యనారాయణుడు భక్తులకు అనుగ్రహిస్తాడు. అందుకే నవగ్రహాల్లో తొలి నమస్కారం సూర్యదేవునికే వుండాలి. నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షణలు శ్రేష్ఠం. అయితే ఈ తొమ్మిది చుట్లు పూర్తయ్యాక.. ఒక్కో గ్రహం నుంచి ప్రత్యేక అనుగ్రహం కోరుకున్నట్లైతే... 
 
సూర్యుడిని - 10సార్లు 
శుక్రుడు -  6సార్లు 
చంద్రుడు -11 సార్లు 
శని - 8 సార్లు 
అంగారకుడు - 9సార్లు 
రాహు - 4 సార్లు  
బుధుడు - 5, 12, 23 సార్లు 
కేతు - 9 సార్లు 
గురు - 3, 12, 21 సార్లు ప్రదక్షించాలి. 
 
యోగాన్ని ప్రసాదించే నవగ్రహాలు 
1. సూర్యుడు - ఆరోగ్యం 
2. చంద్రుడు - కీర్తి 
3. అంగారకుడు - సంపద 
4. బుధుడు- జ్ఞానం 
5. గురు - గౌరవ మర్యాదలు 
6. శుక్రుడు - ఆకర్షణీయత 
7. శనీశ్వరుడు - సుఖమయ జీవనం
8. రాహు - ధైర్యం 
9. కేతు - వంశపారంపర్య ప్రతిష్టలు, గౌరవాన్ని ప్రసాదిస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్నారా? అయితే, ఇది ఉండాల్సిందే..

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

Khazana Jewellery: ఖ‌జానా జ్యువెల‌రీలో దోపిడీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

10-08-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments