Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017లో ధనస్సు రాశి వారి ఫలితాలు...

ధనస్సు రాశివారికి జూన్ వరకు జన్మము నందు శని, ఆ తదుపరి వక్రగతిన వ్యయము నందు అక్టోబరు వరకు, అక్టోబర్ నుంచి తిరిగి జన్మమము నుందు, ఆగస్టు నెల వరకు తృతీయము నుందు కేతువు, భాగ్యము నుందు రాహువు, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు కేతువు, అష్టమము నందు రాహువు, సెప్ట

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (21:21 IST)
ధనస్సు రాశి : మూల 1,2,3,4 పాదాలు (యే, యో, బా, బి). పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు (భూ, ధ, భా,ఢ). ఉత్తరాషాఢ 1వ పాదం. 
 
ఆదాయం 8, వ్యయం 11, పూజ్యత 6, అవమానం 3. 
 
ధనస్సు రాశివారికి జూన్ వరకు జన్మము నందు శని, ఆ తదుపరి వక్రగతిన వ్యయము నందు అక్టోబరు వరకు, అక్టోబర్ నుంచి తిరిగి జన్మమము నుందు, ఆగస్టు నెల వరకు తృతీయము నుందు కేతువు, భాగ్యము నుందు రాహువు, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు కేతువు, అష్టమము నందు రాహువు, సెప్టెంబర్ 12వ తేదీ వరకు రాజ్యము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా లాభము నుందు సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా "యధా బుద్ధిశ్యః తథా ఫలితశ్యః" అన్న చందంగా మీ మనస్సును బట్టే ఫలితాలుంటాయని గమనించండి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు బాగుగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అధిక వ్యయంతో సతమతమవుతారు. వ్యాపారాభివృద్ధికి చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యులతో సలహాతో ముందుకుసాగండి. విద్యార్థుల పట్టుదల, కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన బాకీల విషయంలో మెళకువ వహించండి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్నేహం పరిచయాలు విస్తరిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. స్థిరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
ఉద్యోగస్తులను తోటివారు తప్పుదోవ పట్టించే యత్నం చేస్తారు. జాగ్రత్త వహించండి. నిర్మాణ రంగాల్లో వారికి అనుకోని అభివృద్ధి కానరాగలదు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసి రాగలదు. ఉద్యోగస్తులను తోటివారు తప్పుదారి పట్టించే యత్నం చేస్తారు. జాగ్రత్త వహించడి. నిర్మాణ రంగాల్లో వారికి కలిసి రాగలదు. ఉద్యోగస్తులు పని ఒత్తిడితో సతమతమవుతారు. మార్పులకై చేయు యత్నాలు వాయిదా పడతాయి, మీ మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో వారికి సదావకశాలు లభిస్తాయి. ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల ఆలోచన పలు విధాలుగా ఉంటాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది.
 
మీ బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి. క్రీడాకారులు అత్యుత్సాహంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురువుతాయి. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. పొదుపు చేయాలన్న యత్నాలు ఏమాత్రం ఫలించవు. నోటీసులు, కీలక పత్రాలు అందుకుంటారు. సాంకేతిక రంగాల వారికి సామాన్యం. విద్యార్థుల అధిక శ్రమానంతరం పోటీల్లో రాణించి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. ప్రయాణం ఉల్లాసంగా సాగుతాయి. బెట్టింగ్‌లు, జూదాల వల్ల కష్టాలు తప్పవు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షిణం చేసి, తెల్లని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. 
 
ఈ రాశివారు ప్రతిరోజూ లలిత సహస్రనామం చదవడం వల్ల సంకల్పసిద్ధి గణపతిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. 
మూల నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, పూర్వాషాఢ వారు వజ్రం, ఉత్తరాషాఢ వారు పుచ్చుకెంపు ధరించిన శుభం కలుగుతుంది. 
 
మూల నక్షత్రం వారు వేగి చెప్టును, పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ, ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును ఖాళీ ప్రదేశాల్లోగానీ, దేవాలయాల్లోగానీ, విద్యాసంస్థల్లోగానీ నాటిన శుభం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

తర్వాతి కథనం
Show comments