Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 11 వరకే పెళ్లి సందడి.. ఆపై ఏడాది పాటు పెళ్లిళ్లు ఉండవట!!

Webdunia
సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (11:34 IST)
జూన్ 11వ తేదీ వరకే పెళ్లి సందడి నెలకొంది. ఆపై ఏడాది పాటు పెళ్లిళ్లు ఉండవని జ్యోతిష్యులు అంటున్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి ఊపందుకుంది. వచ్చే సంవత్సరం వివాహం చేసుకోవాలని అనుకున్నవారు కూడా ఈ ఏడాదే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. అది కూడా జూన్ 11లోపే ఏడడుగులు వేయాలని తొందర పడుతున్నారు.
 
గోదావరి పుష్కరాల నేపథ్యంలో జూన్ 11 తర్వాత ఏడాది పాటు వివాహాలు చేయకూడదని పండితులు సూచిస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్ల సందడి జోరందుకుంది. 
 
పుష్కరాలు పూర్తయ్యాక ఆరునెలల పాటు చేయకూడదని కొందరు, ఏడాది పాటు శుభకార్యాలు నిర్వహించకూడదని మరికొందరు చెబుతున్నారు. 
 
బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పటి (జులై 14 పుష్కరాల ప్రారంభం) నుంచి నదికి తూర్పుభాగంలో ఉన్నవారు ఏడాది పాటు, పశ్చిమతీరంలో ఉన్న వారు విజయదశమి వరకు (నాలుగు నెలలపాటు) వివాహాది శుభకార్యాలు చేసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. 
 
కాగా, ఈ సంవత్సరంలో ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 9 వరకు గురుమౌఢ్యం, ఆగస్టు 10 నుంచి 20వ తేదీ మధ్య శుక్రమౌఢ్యం, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 12 వరకు శూన్యమాసం. ఆ సమయంలో సాధారణంగానే శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. 
 
ఆ తరువాత మరో 8 నెలలు ఆగాల్సి ఉంటుందని భావిస్తున్న వేలాదిమంది యువతీ యువకులు జూన్‌లోగానే వివాహాలు చేసుకోవాలని తొందర పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments