Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు 27-07-2017... ఈ రోజు ఎలా వుండబోతుంది?

మేషం: ఈరోజు ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలసివస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. ప

Webdunia
గురువారం, 27 జులై 2017 (05:08 IST)
మేషం: ఈరోజు ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలసివస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ పనులు మందకొడిగా సాగుతాయి.
 
వృషభం : రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడతాయి. కళలు, సాంస్కృతిక రంగాలు, విద్య, న్యాయ రంగాల వారు ఈ రోజు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
మిథునం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ సేవాదక్షత, కార్యదీక్షలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
కర్కాటకం: భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. విద్యుత్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత వంటి శుభపరిణామాలు ఉంటాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం ఉంది.
 
సింహం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏకాగ్రత చాలా అవసరం. అకాల భోజనం, శారీరశ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
కన్య : ఉద్యోగస్తులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరించగలుగుతారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
తుల : ఇంట మీ మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, ధనప్రాప్తి, వస్తులాభం వంటి ఫలితాలున్నాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని గమనించండి.
 
వృశ్చికం : రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, ప్రమోషన్ వంటి శుభ ఫలితాలున్నాయి. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది.
 
ధనుస్సు : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారులకు, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివస్తుంది. కార్యసాధనలో అనుకున్నది సాధించి మీ సమర్థతను నిరూపించుకుంటారు.
 
మకరం: ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు తలెత్తుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కుంభం : ఉపాధ్యాయులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనువైన కాలం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. పెంపుడు జంతువులపై ఆసక్తి అధికమవుతుంది. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
మీనం : స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిమ్ము లను పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ సంతానం విద్యా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

తర్వాతి కథనం
Show comments