శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 03-10-17

మేషం : విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ మాటకు సంఘంలోనూ, కుటుంబంలోనూ గౌరవం లభిస్తుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (05:49 IST)
మేషం : విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ మాటకు సంఘంలోనూ, కుటుంబంలోనూ గౌరవం లభిస్తుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. విద్యార్థినుల్లో ఉత్సాహం నెలకొంటుంది.
 
వృషభం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందవలసి వస్తుంది.
 
మిథునం : విద్యార్థులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతరాత్రా చెల్లింపులు జరుపుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఉపాధి ఉథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
 
కర్కాటకం : వ్యాపారాభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు ప్రణాళికలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. అనుకున్న పనుల ఆలస్యంగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు.
 
సింహం : ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతతో పని చేయవలసి ఉంటుంది. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఐరన్, సిమెంట్, కలప వ్యాపారస్తులకు శుభదాకయం. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది.
 
కన్య : వ్యాపారరంగంలోని వారికి గణనీయమైన అభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలకు చేయటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కొన్ని వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా అనుకూలిస్తాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
తుల : వ్యాపారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ సంతానం ఉన్నత చదువుల పట్ల దృష్టిసారిస్తారు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. ఉద్యోగస్తుల పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలకపోవడంతో అసహనం తప్పదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం.
 
వృశ్చికం : ప్రైవేటు సంస్థలలో వారు ఓర్పు, అంకిత భావంతో పని చేయవలసి ఉంటుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రుణం తీర్చటంతో పాటు తాకట్టు పెట్టిన వస్తువులను విడిపించుకుంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ పనివారు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు : ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాలతో హడావుడిగా ఉంటాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు.
 
మకరం : కుటుంబ, ఆర్థిక విషయాలు కలవరపరుస్తాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దూరప్రదేశంలో ఉన్న మీ సంతానం రాకకోసం ఎదురు చూస్తారు. పత్రికా సిబ్బందికి పనిభారం, ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. ఇతరులను మీ వ్యక్తిగత విషయాలను దూరంగా ఉంచండి.
 
కుంభం : పీచు, ఫోం, లెదర్, ఫర్నీచర్ వ్యాపారులకు కలిసిరాగలదు. పత్రికా సిబ్బందికి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. అధికారిక పర్యటనలు. యూనియన్ వ్యవహారాల్లో క్షణం తీరిక ఉండదు. స్త్రీలలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. అల్లర్లు, ఆందోళనలకు విద్యార్థులు దూరంగా ఉంచాలి.
 
మీనం : పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. బంధువుల రాకవల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారని గమనించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments