Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి ఫలితాలు (25-07-2017).... ఇలా వున్నాయి...

మేషం : స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తితో పాటు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. మీ నిజాయితీ, చిత్తశుద్ధి ప్రముఖులను ఆకట్టుకుంటాయి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర వాణిజ్య రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. సోదరీ, సోదరుల మధ్య అవగా

Webdunia
సోమవారం, 24 జులై 2017 (22:30 IST)
మేషం : స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తితో పాటు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. మీ నిజాయితీ, చిత్తశుద్ధి ప్రముఖులను ఆకట్టుకుంటాయి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర వాణిజ్య రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
వృషభం : మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. కొబ్బరి, పండ్లు, చిరు వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. వాహనచోదకులకు ఊహించని చికాలు తలెత్తుతాయి. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మిథునం : కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు సంబంధించిన అధికారుల సహకారం అందుతుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సమయానికి మిత్రులు సహకరించక పోవడంతో అసహానికి గురవుతారు. 
 
కర్కాటకం : ఉపాధ్యాయుల తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మీ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది.  
 
సింహం : ప్రతిష్టలకు కొంత విఘాతం కలిగే అవగాశం ఉంది. స్త్రీలకు, నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. రుణయత్నాలలో కూడా స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
కన్య : ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. 
 
తుల : హోటల్, తినుబండరాలు, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసివస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. చిట్‌ఫండ్, పైనాన్స్ రంగాలలోని వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు చేపట్టిన పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృశ్చికం : ఆర్థికలావాదేవీల్లో తలెత్తిన వివాదాలను తెలివిగా పరిష్కరిస్తారు. గృహ నిర్మాణానికి కావలసిన ప్లానుకు ఆమోదం లభిస్తుంది. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. 
 
ధనస్సు : భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. ఏ విషయమైనా గోప్యంగా ఉంచండి. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. 
 
మకరం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన వస్తు సామాగ్రి అందజేస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ బలహీనతను ఆసరాగా చేసుకుని లబ్ధిపొందాలని యత్నిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
కుంభం : రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. ముఖ్యులకు బహుమతులను అందజేస్తారు. వ్యాపారాల్లో మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తారు. ప్రేమికుల మధ్య కొత్తకొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహనచోదకులకు చికాకులు ఎదురవుతాయి. ప్రతి విషయంలోనూ నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. 
 
మీనం : కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మిమ్మలను పొగిడేవారి పట్ల అప్రమత్తంగా మెలగండి. వృత్తి విద్యా కోర్సులలో రాణిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments