Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు (24-07-17)... రాత పరీక్షల్లో విజయం మీదే...

మేషం : పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత వస్తువులను కొనుగోలు చేయడం వ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (13:00 IST)
మేషం : పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు అధికమవుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. 
 
వృషభం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విహారయాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనివారికి చికాకులు తప్పవు. రాజకీయంలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. 
 
మిథునం : కుటుంబ పరిస్థితుల క్రమేణా మెరుగుపడటాయి. ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడటం శ్రేయస్కరం. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. పట్టుదలతో ముందడుగు వేస్తారు. రాజకీయాల్లో వారికి విరోధులు చేసే ప్రయత్నాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. 
 
కర్కాటకం : చీటికిమాటికి ఇతరులను కోపగించుకుంటారు. విదేశాలు వెళ్లుటకు అనుకూలం. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. ఫీజులు చెల్లింపులు, రశీదుల విషయంలో జాగ్రత్త అవసరం. క్రయవిక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలు అనాలోచితంగా వ్యవహరించడం ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం : రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. విద్యార్థుల మొండివైఖరి వల్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. 
 
కన్య : కార్మికులకు, ప్రైవేటు సంస్థలయందు పని చేయు క్రింది ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరిస్థితుల క్రమేణా మెరుగుపడతాయి. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందించుట వల్ల మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. 
 
తుల : వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్‌ వారికి సంతృప్తి కానవస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. నిరుద్యోగుల ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాణిజ్య ఒప్పందాలు, స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ వహించండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
వృశ్చికం : ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. రచయితలకు, పత్రికా రంగాలలోని వారికి చికాకులు తప్పవు. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. 
 
ధనస్సు : ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిదికాదని గమనించండి. ఇతర దేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
మకరం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన బకాయిల సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. కొన్ని సమస్యలు మబ్బు వీడినట్టుగా వీడిపోవును. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఫ్లీడర్లు నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.  
 
కుంభం : ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నాలు చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెంపుడు జంతువుల విషయంలో మెళకువ అవసరం.  
 
మీనం : ప్రకటనలు, న్యాయ, బోధనారంగాల వారికి అనుకూలం. గృహావసరాలకు నిధులు సమకూరుతాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

వృశ్చికరాశి జాతకం 2025.. కెరీర్, ఉద్యోగం ఎలా వుంటుంది..?

2025 రాశి ఫలితాలు.. ఏ రాశికి శుభం.. చాలామంది మాంసాహారం మానేస్తారట!

27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

తర్వాతి కథనం
Show comments