Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినఫలాలు 26-06-17 : ఉద్రేకపరిచి లబ్ది పొందాలని చూస్తారు.. తస్మాత్ జాగ్రత్త

అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం విషయంలో అప్రమత్తత అవసరం. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు వాహనం నడుపునపు

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (18:32 IST)
మేషం
అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం విషయంలో అప్రమత్తత అవసరం. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు ఏకాగ్రత చాలా అవసరం.
 
వృషభం
మిత్రుల కలయిక అనుకూలించకపోవచ్చు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు అధికమవుతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారు ఒత్తిడి ఎదుర్కుంటారు. స్త్రీలకు పుట్టింటి వారి నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. 
 
మిథునం
స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయటం మంచిది. దైవ, సాంఘిక సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. 
 
కర్కాటకం
వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టి ఉండటం మంచిది. పాత జ్ఞాపకాల గురించి మిత్రులతో చర్చించడం వల్ల ఉల్లాసాన్ని పొందుతారు. చేతి వృత్తులు, ప్రైవేటు సంస్థల్లో వారికి లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. మిమ్ములను ఉద్రేకపర్చి లబ్ది పొందాలని ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి. 
 
సింహం
విరివిగా ధనం వ్యయం చేయటం వల్ల బంధుమిత్రులలో అపోహలు, పలు అనుమానాలు తలెత్తగలవు. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు సంతృప్తి, ప్లీడర్లకు చికాకు అధికం అవుతాయి. చేపట్టిన పనుల్లో సంతృప్తి కానవస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తాయి.
 
కన్య
పూలు, పండ్లు, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం.  అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికానవస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చేపట్టిన పనుల్లో ఏకాగ్రత లోపం వల్ల సమస్యలెదుర్కోవలసి వస్తుంది. 
 
తుల 
తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురికాకండి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. ఎరువులు, మందులు, సుగంధ ద్రవ్యాలు, ఆల్కహాలు వ్యాపారులకు అభవృద్ధి కానవస్తుంది. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. మీ కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచండి. 
 
వృశ్చికం 
ఒక ముఖ్య కార్యం నిమిత్తం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి అభద్రతాభావం, ఆందోళన కలుగుతుంది. మీ సన్నిహితుల వాఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల మీద మక్కువ పెరుగుతుంది. 
 
ధనస్సు
ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పట్టుదలతో ఏదైనా సాధించగలమన్న విశ్వాసం మీలో నెలకొంటుంది. ధనవ్యయం విషయంలో అదుపుస ఆలోచన అవసరం. ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
మకరం
భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు అనుకూలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి ఆశించిన ఫలితం ఉండదు. ఊహించని ఖర్చులు మీ అంచనాలను దాటుతాయి. ఇతరుల కారణం వల్ల చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది.
 
కుంభం
ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. 
 
మీనం
స్త్రీలకు చుట్టు పక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. విద్యార్థినులలో భయాందోళనలు అధికం అవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి.  ఫైనాన్సు, చిట్‌ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

లేటెస్ట్

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

తర్వాతి కథనం
Show comments