Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-09-2018 - ఆదివారం దినఫలాలు - అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి...

మేషం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వలన సమసిపోగలవు. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. పెద్దమెుత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (10:11 IST)
మేషం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వలన సమసిపోగలవు. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. పెద్దమెుత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం: ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. మానసిక ప్రశాంతతకు పుస్తక పఠనం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించండి. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.     
 
మిధునం: మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. రాజకీయాలలో వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా కలిగివస్తుంది. బంధువులు, సోదరుల మధ్య సత్సబంధాలు నెలకొంటాయి.   
 
కర్కాటకం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారిక పనిభారం అధికమవుతుంది. ప్రేమికులు ఎడబాటు, ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. నిత్యావసర వస్తు, స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తి చూపుతారు. ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది.    
 
సింహం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విందులు, విలాసాలలో మితంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 
 
కన్య: ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ప్రముఖుల కలయిక సాధ్యపడుతుంది. స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వలన మాటపడక తప్పదు. రచయితలకు, పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది.      
 
తుల: ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. మీ ఏమరపాటుతనం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. పత్రిగా సిబ్బందికి ఏకాగ్రత సునిశిత పరిశీలన ప్రధానం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు అదనవు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు కృషి ఫలిస్తుంది.       
 
వృశ్చికం: ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పాత శత్రువులు మిత్రులుగా మారుతారు. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. దుబారా ఖర్చులు అధికం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.  
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలువు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కార్యదీక్షతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఎప్పటినుండో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం.    
 
మకరం: రాజకీయ నాయకులు ప్రయాణాలలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి.    
 
కుంభం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ ఏజెంట్లకు సదవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వలన ఆందోళనలకు గురవుతారు. నిరుద్యోగులు రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. స్త్రీలకు బంధువులరాక వలన పనిలో ఆటంకాలు తలెత్తుతాయి. బంధుమిత్రుల మధ్య రహస్యాలు దాచడం వలన విభేదాలు తలెత్తవచ్చు.  
 
మీనం: రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపటి సమస్యగురించి అధికంగా ఆలోచిస్తారు. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. రవాణా రంగాలలోవారికి ఏకాగ్రత చాలా అవసరం. రోజులు, భారంగాను, విసుగ్గాను సాగుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..

18 Kilometers : 200 మంది విద్యార్థులు.. 18 కిలోమీటర్లు నడిచారు..

Christmas : చంద్రబాబు, పవన్, జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas: పౌరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments