28-03-2020 శనివారం మీ రాశిఫలాలు

శనివారం, 28 మార్చి 2020 (00:00 IST)
మేషం : వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చిన్నతరహా వ్యాపారులకు ఆశాజనకం. మీ వ్యక్తిగత విషయాలు ఇతరుల ముందు ఏకరవు పెట్టడం మంచిదికాదు. నూతన పెట్టుబడులు, కాంట్రాక్టుల వ్యవహారంలో పునరాలోచన అవసరం. 
 
వృషభం : గృహంలో సందడి కానవస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి వహిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన వెంచర్ల పట్ల ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
మిథునం : కళాకారులకు, పత్రికా రంగంలో వారికి సత్‌కాలం. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి అధికం అవుతుంది. స్త్రీలకు వ్యాపకాలు కొత్త పరిచయాలు అధికమవుతాయి. విద్యార్థినిలకు భవిష్యత్, తమ శక్తిసామర్థ్యాల పట్ల విశ్వాసం పెరుగుతుంది. 
 
కర్కాటకం. : స్త్రీలు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశించినతం పురోభివృద్ధి ఉండదు. విదేశీయాన యత్నాలు కలిసివస్తాయి. ఆడిట్ రంగాల్లో వారికి ఒత్తిడి. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్ధిస్తారు. స్థిర, చరాస్తుల కొనుగోలుకై చేయు ప్రయత్నాలు వాయిదాపడగలవు. 
 
సింహం : ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. సాంఘిక, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు మిత్ర బృందాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్నతరహా, చిరువృత్తుల వారికి ఆశాజనకం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు చికాకులు తప్పవు. 
 
కన్య : వస్త్ర, బంగారు, వెండి, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలలో సంతృప్తికానవస్తుంది. ప్రేమికులకు ప్రతి విషయంలోనూ ఓర్పు ఎంతో అవసరం. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలించవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. 
 
తుల : కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. సహోద్యోగులు, సన్నిహితులతో సమావేశాలు నిరాశజనకంగా ముగుస్తాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులలో తలమునకలవుతారు. సన్నిహితుల మధ్య దాపరికాలు సరికాదని గమనించండి. ఆధ్యాత్మిక చర్చలు, ఆలయ సందర్శనలు స్వాంతన కలిగిస్తాయి. 
 
వృశ్చికం : గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఓర్పు, లౌక్యం ఎంతో అవసరం. వైద్య రంగాల్లో వారికి ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. విదేశాలు వెళ్ళే ఆలోచన క్రియారూపం దాల్చుతుంది. గతానుభవాలు జ్ఞప్తికిరాగలవు. ప్రయాణాలు ఫైనాన్సు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. 
 
ధనస్సు : స్త్రీలు ఏమరుపాటుతనంవల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం చేతికందుతుంది. పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాణిజ్యం ఒప్పందాలు, స్థిరాస్తి వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
మకరం : స్థిరాస్తి అమ్మకం వాయిదాపడం మంచిది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసి అధికారులను మెప్పిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం. విద్యార్థులు అసహనానికి లోనవుతారు. 
 
కుంభం : నిత్యావసర వ్యాపారస్తులకు శుభదాయకం. ఖర్చులు అధికం కావడంతో ఒకింత ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. భాగస్వామిక వ్యవహారాల్లో మెలకువ అవసరం. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగిపోగలవు. కంప్యూటర్, ఎలక్ట్రానికి రంగాల వారికి ఆశాజనకం. ఒక లేఖ మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
మీనం : గణిత, సైన్స్, టెక్నికల్ ఉపాధ్యాయులకు పురోభివృద్ధి. ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఏజెంట్లుకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనే మీ ఆలోచన త్వరలోనే రూపుదాల్చగలదు. సినిమా కళా రంగాల్లో వారికి చికాకులు తప్పవు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శుక్రవారం (27-03-2020) మీ రాశిఫలాలు - దుర్గాదేవిని పూజిస్తే...