Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-03-2020 గురువారం రాశిఫలాలు - బాబా గుడిలో అన్నదానం చేస్తే...

Advertiesment
26-03-2020 గురువారం రాశిఫలాలు - బాబా గుడిలో అన్నదానం చేస్తే...
, గురువారం, 26 మార్చి 2020 (00:00 IST)
మేషం : బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంలో స్వల్ప చికాకులు ఎదురైనా క్రమేణా పరిస్థితులు చక్కబడతాయి. 
 
వృషభం : స్త్రీలకు అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా ఖర్చు అవుతుంది. అవివాహితులకు అందిన ఒక సమాచారం వారిని సందిగ్ధంలో పడవేస్తుంది. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూల, నిత్యావసరవస్తు వ్యాపారులకు లాభదాయకం. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. చేపట్టిన పనులలో చికాకులు, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
కర్కాటకం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. వాహనచోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ సంతానం ఆరోగ్యం తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవరసరం. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. 
 
సింహం : ముఖ్యమైన పత్రాలు సమయానికి కలిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం, శ్రమాధిక్యత తప్పవు. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య : ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. స్త్రీలకు ఉదరం, దంతాలు, నడుము, మెకాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనకతప్పదు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నిరుద్యోగుల ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. 
 
తుల : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు రచనలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
వృశ్చికం : చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఊహించని ఖర్చులు, వాయిదా చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. 
 
ధనస్సు : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. స్త్రీలకు విలాసాలు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త సమస్యలెదురయ్యే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. స్టాక్ మార్కెట్ రంగాలవారి అంచనాలు ఫలించవు. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
 
మకరం : ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధుమిత్రులకు హామీ ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. 
 
మీనం : స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో సంబంధం లేకుండా మీ పనిలో మీరు నిమగ్నలవుతారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాళ్ల ఉప్పు, పసుపును ఇంటి చుట్టూ వేస్తే.. వైరస్ మటాష్