Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-03-2020 బుధవారం రాశిఫలాలు

Advertiesment
25-03-2020 బుధవారం రాశిఫలాలు
, బుధవారం, 25 మార్చి 2020 (05:00 IST)
మేషం : వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ది కానవస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. రవాణా రంగాలవారికి మెళకువ, ఏకాగ్రత అవసరం.  
 
వృషభం : అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆసక్తి అధికమవుతుంది. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మిథునం : ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల దేనిలోనూ ఏకాగ్రత వహించలేరు. పెద్దల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోలేక తప్పదు. మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. ఊహించని ఖర్చులు వల్ల అధిక ధనవ్యంయ తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం : మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విద్యార్థులు క్రీడా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
సింహం : రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. విదేశాలు వెళ్ళడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దూర ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య : బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులు తప్పవు. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. మిత్రుల రాకతో ఖర్చులు అధికం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. స్త్రీలు, ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. తప్పనిసరి చెల్లింపులు వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. 
 
వృశ్చికం : దైవ, సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు చేస్తారు. విందు, వినోదాలలో పరిమితి పాటించండి. మత్య్సు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలు, ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తూ సత్ఫలితాలు పొందుతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదు. పాత వస్తువులను కొని ఇబ్బందులకు గురవుతారు. 
 
ధనస్సు : మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మకరం : సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. చీటికి మాటికి, ఎదుటివారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. 
 
కుంభం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు పట్టదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు.
 
మీనం : వృత్తి వ్యాపారాలకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు.. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. కానివేలలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు ఎదురవుతాయి. బంధువుల, కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మానుష్యంగా శ్రీవారి మాడవీధులు.. రాత్రివేళల్లో క్రూరమృగాల సంచారం?!