Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24-03-2020 మంగళవారం మీ దినఫలాలు

24-03-2020 మంగళవారం మీ దినఫలాలు
, మంగళవారం, 24 మార్చి 2020 (05:00 IST)
మేషం : ఉపాధ్యాయులకు బదిలీవార్త ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆకస్మికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
వృషభం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు సమయం కలిసివస్తుంది. మీ సంతానం పైచదువుల పట్ల దృష్టిసారిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. 
 
మిథునం : వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
కర్కాటకం : స్త్రీలకు అర్జనపట్ల, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జాయింట్ వెంచర్లు, ఉమ్మడి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, నిర్మాణ పనుల్లో చికాకులు తొలగి మానసికంగా కుదుటపడుతారు. 
 
సింహం : ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. సేవా సంస్థల్లో సభ్యత్వం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. బంధువులతో సఖ్యత ఏర్పడతంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. 
 
కన్య : బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు పురోభివృద్ధి. రియల్ ఎస్టేట్ రంగాలవారికి నూతన వెంచర్లు కలిసిరాగలవు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. 
 
తుల : వృత్తిపరంగా కొన్ని పరిచయాలేర్పడతాయి. విదేశీయానం, రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు తొలగిపోతాయి. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు తోటవారి నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. ఒక నష్టాన్ని మరొక విధంగా భర్తీ చేసుకుంటారు. ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తికానరాదు. ఆలయాలను సందర్శిస్తారు. ఎంతోకొంత పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. పాత మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. 
 
ధనస్సు : కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారుల ఒత్తిడిపెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయంలో పనులు సకాలంలో పూర్తికావు. ధనియాలు, ఆవాలు, పసువు, ఎండుమిర్చి, నూనె, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మకరం : ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి వల్ల  పనిభారం అధికమవుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. చివరి క్షణంలో చేతిలో ధనం అందక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. హోటల్, తినుబండ రంగాలలో వారికి చికాకులు తలెత్తుతాయి. కాలానుగుణంగా మీ సమస్యలు పరిష్కరమవుతాయి. 
 
కుంభం : విదేశీయాన ప్రయాణానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగి రాజాలదు. 
 
మీనం : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. స్త్రీలకు ఆహార ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిల్వపత్రాలతో శివపూజ, శివార్చన చేస్తే?