శుక్రవారం (27-03-2020) మీ రాశిఫలాలు - దుర్గాదేవిని పూజిస్తే...

శుక్రవారం, 27 మార్చి 2020 (05:00 IST)
మేషం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండదు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తలెత్తగలవు. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ మేథస్సుకి, వాక్‌చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం : పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్థులకు యోగప్రదం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. సాంఘిక కార్యక్రమాలలో చురుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. మీ పెద్దల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
మిథునం : కాంట్రాక్టుల, బిల్డర్లు కొత్త పనులు చేపడుతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తికానరాగలదు. 
 
కర్కాటకం : బంధువులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది. పెద్దల ఆరోగ్య, ఆహర వ్యవహారాలలో మెళకువ వహించండి. రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభించినా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. 
 
సింహం : రాజకీయాలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడి. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులు కొనుగోలు యత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కన్య : రాజకీయాలలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరులు సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. 
 
తుల : మీరు తొందరపడి సంభాషించడం వల్ల ఊహించని సమస్యలు తలెత్తగలవు. మనుష్యుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. స్త్రీలకు ఆదనపు సంపాదన పట్ల దృష్టిసారిస్తారు. 
 
వృశ్చికం : కుటుంబీకుల సంతోషం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పైఅధికారులతో ఒత్తిడి, చికాకులు తప్పవు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
ధనస్సు : తల పొట్టకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. 
 
మకరం : అధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నంఫలించదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడుట మంచిది. 
 
కుంభం : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. శత్రువులు, మిత్రులుగా మారతారు. ఇతరుల గురించి ఆనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. నం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు తప్పుదు. ఎల్.ఐ.సి పాలసీ, బ్యాంకు, డిపాజిట్ల ధనం చేతికందుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలునిస్తాయి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. దూర ప్రయాణలక్ష్యం నెరవేరుతుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 26-03-2020 గురువారం రాశిఫలాలు - బాబా గుడిలో అన్నదానం చేస్తే...