Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-10-2018 - శనివారం మీ రాశిఫలితాలు - నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో..

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (09:50 IST)
మేషం: పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలు, ప్రాజెక్టుల దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ సంతానం ఉన్నత విద్య గురించి ఒక నిర్ణయానికి వస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. ఆకస్మికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృషభం: దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వలన మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సభలు, సమావేశాలలో హూందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి.  
 
మిధునం: ఉన్నతాధికారుల హోదా పెరగడంతో పాటు స్థానమార్పు ఉంటుంది. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ చాలా అవసరం. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో మెళకువ వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.  
 
కర్కాటకం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ప్రతి పనిలోను ఎదుటివారి నుండి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తప్పవు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.  
 
సింహం: రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తికానవస్తుంది. మీ శ్రీమతి పోరుతో కొత్తయత్నాలు మెుదలుపెడతారు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.  
 
కన్య: ప్రభుత్వ సంస్థలలో పనులు వాయిదా పడుతాయి. వారసత్త్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. మీ కళత్ర మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు. విద్యార్థులకు ఏకాగ్రత, ఆసక్తి ఏర్పడుతుంది.  
 
తుల: విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. విదేశీయానం కోసం చేసేయత్నాలు అనుకూలిస్తాయి. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత చాలా అవసరం.   
 
వృశ్చికం: బంధువుల ఆకస్మిక రాస వలన స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తల, ఎముకలకు సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు.    
 
ధనస్సు: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వాహన చోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థుల మెుండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.   
 
మకరం: ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ఆకస్మికంగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. స్త్రీలకు బంధువులతో పట్టింపులొస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. ఆపద సమయంలో మిత్రులు ఆదుకుంటారు.  
 
కుంభం: స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించినా సత్ఫలితాలు పొందగలరు. కీలకమైన వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.  
 
మీనం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలు వాయిదాపడుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. ప్రభుత్వకార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మత్తులు చేపడతారు.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరే... పేర్ని నాని నీ బ్యాటరీ సరిగ్గా లేదు... పవన్ మంచోడు కాబట్టే.. : జేసీ ప్రభాకర్ రెడ్డి (Video)

తూగోలో రేవ్ కలకలం... ఐదుగురు అమ్మాయిలతో 14 మంది పురుషుల పార్టీ!!

Hyderabad: ప్రేమలో మునిగి తేలుతున్నారు.. వాటిని ఆర్డర్ చేశారు..

హమాస్ కమాండ్ కంట్రోల్‌ ఆస్పత్రిలో దాడి.. 43 మంది మృతి

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

27-12-2024 శుక్రవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

26-12-2024 గురువారం దినఫలితాలు : విలాసాలకు వ్యయం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments