Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-12-2019 గురువారం మీ రాశి ఫలితాలు_దుర్గాసప్త శ్లోక పారాయణంతో? (Video)

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (06:03 IST)
దుర్గాసప్త శ్లోక పారాయణం చేయడం వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది. 
 
మేషం: ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విద్యార్థులకు అత్సుత్సాహం కూడదు. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
వృషభం: ఉద్యోగస్తులకు అధికారులతో సఖ్యత నెలకొంటుంది. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఆశాజనకం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. భాగస్వామిక వ్యాపారాలు, లీజు, నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. స్త్రీలకు అయిన వారి నుంచి ఆదరణ, సహాయ సహకారాలు అందుతాయి.
 
మిథునం: దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు బలపడతాయి. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. 
 
కర్కాటకం: ఓర్పు, రాజీ మార్గంలో మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం. పన్నులు సకాలంలో చెల్లిస్తారు. ఆరోగ్య భంగం, సంతాన మూలక సమస్యలు మనస్థిమితం లేకుండా చేస్తాయి.
 
సింహం : ఆదాయవ్యయాలు సంతృప్తికరం. రచయితలకు, పత్రికా రంగాల వారికి అనుకూలమైన కాలం. నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు. విద్యార్థులకు తోటివారితో సాన్నిత్యం ఏర్పడుతుంది. స్త్రీలకు ఆర్జన, సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. 
 
కన్య: గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్, తినుబండ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఉన్నతస్థాయి అధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా వుండటం శ్రేయస్కరం. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
తుల: ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. పుణ్యక్షేత్ర సందర్శనలు, ప్రయాణాలకు అన్నివిధాలా అనుకూలం. ధనం అధికంగా వ్యయం చేసినా ఒక మంచి పని చేసినా తృప్తి వుంటుంది. సేవా సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. మొహమ్మాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు తోటివారితో ఊహించని చికాకులు తలెత్తుతాయి. మార్కెట్ రంగాలవారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుని వారికి బహుమతులు అందజేస్తారు. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు.
 
ధనస్సు: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రముఖులను కలుసుకుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, బంగారు ఆభరణ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. నూతన వివాహితులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. 
 
మకరం: ఉద్యోగస్తులకు వృత్తుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కుటుంబీకుల సహకారంతో ముందడుగు వేస్తారు. 
 
కుంభం : స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం వంటి శుభఫలితాలున్నాయి. విద్యార్థినులకు పరీక్షల్లో ఏకాగ్రత, సమయపాలన చాలా అవసరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు కలిసిరాగలవు. శుభకార్యాల్లో ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 
 
మీనం : స్త్రీలు విందు, వినోదాలు, విలువైన వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన అధికం అవుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంతో ముందుకు నడుస్తారు. రుణాలు, చేబదుళ్లు, అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayashanti: పుష్ప-2 తొక్కిసలాట.. రాజకీయం చేయొద్దు.. విజయశాంతి

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments