Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం (2608-18) దినఫలాలు - ఎదుటివారిపై నిందారోపణ..

మేషం : ఉపాధ్యాయులకు అనూకూలం. ఫ్యాన్సీ, కిరాణా, కిళ్లీ రంగాలలో వారికి పనులు మందకొడిగా సాగుతాయి. నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం కానవస్తుంది. ఏజంట్లకు, బ్రోకర్లకు అనుకూలం. మధ్యవర్తిత్వం వహించడంవల్ల మాట

Webdunia
ఆదివారం, 26 ఆగస్టు 2018 (09:26 IST)
మేషం : ఉపాధ్యాయులకు అనూకూలం. ఫ్యాన్సీ, కిరాణా, కిళ్లీ రంగాలలో వారికి పనులు మందకొడిగా సాగుతాయి. నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం కానవస్తుంది. ఏజంట్లకు, బ్రోకర్లకు అనుకూలం. మధ్యవర్తిత్వం వహించడంవల్ల మాటపడవలసివస్తుంది. ఖర్చులకు సరిపడ ధనం సమకూరుట వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు.
 
వృషభం : కుటుంబంలో ఒకకి ఆరోగ్యము మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. గుర్తింపు లేనిచోట శ్రమపడరాదు. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన లోపం, తోటి వారి సహకారం లభిస్తుంది. ఐరన్, సిమెంటు, కలప, ఇనుము, ఇసుక, ఇటుక, వ్యాపారస్తులకు లాభదాయకం.
 
మిథునం : ఎదుటివారిపై నిందారోపణ చేయుట వలన మాటపడక తప్పదు. విద్యార్థులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. రచయితలకు, పత్రిక రంగంలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఆటంకాలు తప్పవు.
 
కర్కాటకం : కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. రుణ విముక్తులు కావటంతో పాటు కొత్త రుణాలు పొందుతారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల వల్ల ఇక్కట్లు ఎదురవుతాయి. ఉద్యోగులు గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
సింహం : రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఆపద సమయంలో బంధు, మిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. విందులు, వేడుకలలో మితంగా వ్యవహరించండి.
 
కన్య : పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. ఏ విషయంపై అయినా స్పందించే ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరొక్కసారి ఆలోచించండి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. బిల్లులు చెల్లిస్తారు.
 
తుల : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. మీ విరోధులు వేసే పథకాలు త్రిప్పిగొట్టగలుగుతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా వేయండి. ఖర్చులు అధికం.
 
వృశ్చికం : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు.
 
ధనస్సు : మీ శ్రీమతిలో వచ్చిన మార్పు మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, ఇతరవ్యాపకాలు అధికం కావటంతో చికాకులు తప్పవు. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు.
 
మకరం : పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ఆకర్షణలకు దూరంగా ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులవల్ల ఇబ్బందులు తప్పవు. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి.
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారంవుంది. జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. మీ వాక్చాతుర్యం అందరిని ఆకట్టుకుంటుంది.
 
మీనం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికం అవుతాయి. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు టివి ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. వ్యాపారం చేయాలి అనే ఆలోచన కొంతకాలం వాయిదా వేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, అలిపిరి మెట్ల మార్గం విశిష్టత ఏమిటి? (video)

14-08-2025 గురువారం మీ రాశి ఫలితాలు - శ్రమ అధికం, ఫలితం శూన్యం

Vishnu Sahasranama: నక్షత్రాల ఆధారంగా విష్ణు సహస్రనామ పఠనం చేస్తే?

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

తర్వాతి కథనం
Show comments