Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-10-2018 గురువారం దినఫలాలు - అధైర్యం వదలి ధైర్యంతో...

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (08:49 IST)
మేషం: ఉద్యోగస్తులకు పై అధికారులతో సదవగాహన, తోటివారి సహకారం లభిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాలవారికి పనిలో ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తలెత్తగలవు. 
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూల, తినుబండారాలు వ్యాపారులకు పురోభివృద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. అధైర్యం వదలి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. 
 
మిధునం: ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. సోదరిసోదరులతో అవగాహన కుదరదు. స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.  
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. రాజకీయనాయకులకు సభలు, సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. గృహంలో ఏదైనా వస్తువు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, సదవకాశాలు లభిస్తాయి.   
 
సింహం: నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీ అలవాట్లు, మాటతీరు మార్చుకోవడం మంచిది. రావలసిన ధనం ఆలస్యంగా అందడం వలన ఒడిదుడుకులు తప్పవు. తరచు సేవ, దైవ కార్యాల్లో పాల్గొంటారు. బ్యాంకు పనులు హడావుడిగా ముగిస్తారు.  
 
కన్య: స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. తరచు బంధుమిత్రులను కలుసుకుంటారు. తాపీపనివారు, నిరుద్యోగులు తొందరపాటు తనంవలన సదవకాశాలు జారవిడుచుకుంటారు. సేవా కార్యాక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది.  
 
తుల: ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం ఖర్చుచేస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహించలేరు. వారసతత్త్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.  
 
వృశ్చికం: మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల రాక వలన గృహంలో సందడి కానవస్తుంది. ముఖ్యుల నుండి ధన సహాయం లభించడంతో ఒకడుగు ముందుకు వేస్తారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడగలవు.  
 
ధనస్సు: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. కళాకారులకు, సినిమారంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. స్త్రీలకు దూర ప్రయాణాలలో కొత్త వ్యాపకాలు, పరిచయాలు ఏర్పడుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం వేచి ఉండాల్సి వస్తుంది.  
 
మకరం: విద్యార్థులకు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. చిట్స్, ఫైనాన్స్ రంగాలవారికి కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఋణం ఏ కొంతైనా తీర్చడానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది.  
 
కుంభం: ఉద్యోగ యత్నాలపై దృష్టి సారిస్తారు వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు అయిన వారి ఆదరణ లభిస్తుంది. క్రీడా, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడడం మంచిదని గమనించండి. 
 
మీనం: భాగస్వామిక వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. రుణం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అధికారుల హోదా పెరగడంతో పాటు స్థానచలనం తప్పదు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2025 ఆదివారం దినఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

01-06-2025 నుంచి 30-06-2025 వరకు మీ మాస ఫలితాలు

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

తర్వాతి కథనం
Show comments