Webdunia - Bharat's app for daily news and videos

Install App

15-12-2018 శనివారం దినఫలాలు - దీర్ఘకాలిక సమస్యలకు...

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (09:24 IST)
మేషం: ఆర్థికలావాదేవీలు వాయిదా పడడం మంచిది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. ప్రత్యర్థుల కదలికలను ఓ కంట కనిపెట్టడం మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూల, బేకరి, తినుబండారాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలు, పనితీరుకు కుటుంబీకుల నుండి అభ్యంతరా లెదురవుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారానికి బాగా శ్రమిస్తారు.
 
మిధునం: కళా, క్రీడా, సాంకేతిక, శాస్త్ర రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. అందరితో కలిగి విందు వినోదాలలో పాల్గొంటారు. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యాలు మనస్తాపం కలిగిస్తాయి. చిట్స్, పైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేయండి.
 
కర్కాటకం: ఆర్థికస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీల పై చుట్టుప్రక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. మత్స్స, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పాత రుణాలు తీరుస్తారు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఊహించని ఖర్చుల వలన స్వల్ప ఒడిదుడుకులు తప్పవు.
 
సింహం: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రముఖుల కలయిక వలన కొన్ని పనులు సానుకూలమవుతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు.
 
కన్య: మీ సంతానం మొండివైఖరి మీరు చికాకు కలిగిస్తుంది. బంధువులరాక వలన ఖర్చులు, పనిభారం, ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడుతాయి. స్త్రీలు షాపింగ్ విషయాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం.
 
తుల: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. మీ రాక సన్నిహితులకు సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, అవకాశం కలిగివస్తాయి. దూరప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. ఆస్తి, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
ధనస్సు: వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. చేపట్టిన పనులు వాయిదాపడుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. స్త్రీలకు అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం: ఆర్థిక, ఆరోగ్య విషయాలలో సంతృప్తి కానవస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వాహనం కొనుగోలు చేయు ప్రయత్నాలలో జయం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు తప్పవు. అతిధి మర్యాదు, సత్కారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
కుంభం: ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుని వారికి బహుమతులు అందజేస్తారు. రుణాలు చేబదుళ్ళుకు యత్నాలు సాగిస్తారు. బంధువులను కలుసుకుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి బరువు బాధ్యతల నుండి విశ్రాంతి పొందుతారు. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికిరాగలవు.
 
మీనం: ఎల్.ఐ.సి, బ్యాంకింగ్, ఉద్యోగస్తులు విశ్రాంతి లభించకపోవడం వలన ఆందోళన చెందుతారు. లిటేగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. స్త్రీలకు దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. మొండిధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం, స్వల్ప ఆటంకాలు తప్పవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2024 ఆదివారం ఫలితాలు - అనుభవజ్ఞుల సలహా పాటించండి...

01-12-2024 నుంచి 07-12-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు

30-11-2014 శనివారం వారం ఫలితాలు : సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

2025లో శనిగ్రహ మార్పు... ఈ ఐదు రాశులకు అంతా అనుకూలం..

తర్వాతి కథనం
Show comments