Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-08-2019- మంగళవారం రాశి ఫలితాలు-మీ శ్రీమతి మొండి వైఖరి?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (07:00 IST)
మేషం: ఆర్థిక వియాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్థిరచరాస్తులక్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. రాజకీయ నాయకులకు పదవి సమస్యలు అధికమవుతాయి. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం: ఉద్యోగస్తులు పనిభారం వల్ల అశాంతికి లోనవుతారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. బ్యాంకు వ్యవహారాల్లో మెళుకువ అవసరం. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు నెమ్మదిగా తీరుతాయి. క్రయ, విక్రయ రంగాల్లో వారికి సంతృప్తి కానరాగలదు. 
 
మిథునం: ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. రావలసిన ధనం చేతికి అందటంతో పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. వాహన చోదకుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం: చేపట్టిన పనులలో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఖర్చులు మీ స్థోమతకు తగినట్లుగానే ఉంటాయి. రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. కళత్ర మొండి వైఖరి మీకు చికాకును కలిగిస్తుంది.
 
సింహం: భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సమసిపోతాయి. వైద్యరంగాల్లోని వారికి శస్త్ర చికిత్సల సమయంలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనివారలతో తలెత్తినా నెమ్మదిగా సమసిపోతైయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ప్రైవేటు సంస్ధలలోని వారికి యాజమ్యానంతో ఏకీభావం లోపిస్తుంది.
 
కన్య: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు కలిసిరాగలదు. బ్యాంకు రుణాలు తీర్చడంతో పాటు కొంత రుణం తీసుకుంటారు. బంధువుల మధ్య సయోధ్య లోపిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీలకు అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది.
 
తుల: బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగలసి ఉంటుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. పండ్లు, పూలు, కొబ్బరి పానీయ వ్యాపారులకు లాభదాయకం. మనసు లగ్నము చేసి, పనిపై శ్రద్ధ పెట్టినా ఆశించిన ఫలితాలు పొందుతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు: బంధు వర్గాలతో అభిప్రాయభేదాలు తప్పవు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, బేకరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రయాణాలు, ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం: ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధననష్టము సంభవించును. ప్రయాణాలలోనూ, ఆలయ సందర్శనాలలో మెళుకువ అవసరం. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. గృహ అవసరాలకు నిధులు సమకూరుతాయి.
 
కుంభం: అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపులవల్ల ఆటుపోట్లు తప్పవు. సోదరీ, సోదరులతో ఏకీభవించ లేకపోతారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ శ్రీమతి మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments