Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-08-2018 - శనివారం మీ రాశి ఫలితాలు.. స్త్రీల ఆరోగ్యం మందగించటంతో పాటు?

మేషం: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూరప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (09:23 IST)
మేషం: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూరప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.
 
వృషభం: వృత్తి, వ్యాపారులు ప్రోత్సాహకరం. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని వెంటనె సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. ముఖ్యమైన పత్రాలు, నోటీసులు అందుకుంటారు. స్త్రీలకు తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.  
 
మిధునం: ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలిస్తాయి. ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాల నివ్వగలవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. విందులలో పరిమితి పాటించండి. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. 
 
సింహం: రచయితలకు, పత్రికా రంగాల వారికి కీర్తి, గౌరవాలు లభిస్తాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ఆలయాలను సందర్శిస్తారు. ఆత్మీయులకు, సన్నిహితులకు శుభాకాంక్షలు అందజేస్తారు. 
 
కన్య: స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం మందగించటంతో పాటు శస్త్రచికిత్సలు, ఔషధసేవలు అవసరమౌతాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.   
 
తుల: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనివ్వగలవు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం ఉంది. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది.  
 
వృశ్చికం: సైన్స్, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు, ఆందోళనలు వంటివి తలెత్తుతాయి.  
 
ధనస్సు: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వలన అశాంతికి లోనవుతారు. స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు.  
 
మకరం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికరల్, కంప్యూటర్ రంగాలవారికి ఆశాజనకం. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు పై అపనిందలు వంటివి ఎదుర్కుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. 
 
కుంభం: విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత, పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాలవారికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు ప్రగతిపథంలో సాగుతాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. 
 
మీనం: నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో చర్చలు జరుపుతారు. మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. కొన్ని నచ్చని సంఘటనలు ఎదురైనా భరించక తప్పదు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. దైవ దర్శనాలు అనుకూలంగా సాగుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

తర్వాతి కథనం
Show comments