Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-10-2018 బుధవారం దినఫలాలు - . శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల...

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (09:09 IST)
మేషం: విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ మాటే నెగ్గాలన్న పట్టుదలకు పోవడం మంచిది కాదు.
 
వృషభం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. కొత్త పరిచాయాలు ఏర్పడుతాయి. మీకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యారులకు లాభదాయకం. రుణాలకోసం అన్వేషిస్తారు. మిత్రుల సహకారంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు.     
 
మిధునం: కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం ఫలిస్తుంది. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆసక్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.  
 
కర్కాటకం: వృత్తి వ్యాపార రంగాలలో సహచరుల మద్దతు లభిస్తుంది. శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్టాకిస్టులకు, బ్రోకర్లకు, ఏజెంట్లకు అనుకలత. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.  
 
సింహం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికమవుతున్నారని గమనించండి. మీ మనోభావాలకు మంచి స్పురణ లభించగలదు. ఉద్యోగస్తుల సమర్థలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు నూత పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.  
 
కన్య: తరచు సేవా, దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ధనం విపరీతంగా వ్యయం చేసే మీ ధోరణిని మార్చుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి.    
 
తుల: ఆర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ధైర్యంతో ముందడుగు వేస్తే తప్ప మీరు చేయాలనుకున్న విషయం ఆనందదాయకం కాదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు.  
 
వృశ్చికం: నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉత్తమం. తొందరపడి హామీలివ్వడం మంచిది కాదు. సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.    
 
ధనస్సు: ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మీ పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులకు, విద్యార్థుల మధ్య అవగాహన లోపం వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. శ్రీమతి సలహా పాటించడం అన్ని విధాలా మంచిది. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది.  
 
మకరం: జూదాలు, బెట్టింగ్‌ల వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. పెద్దల ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.  
 
కుంభం: పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివస్తుంది. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. వ్యాపార ఒప్పందాలు, స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం, ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.   
 
మీనం: మీ మాటే నెగ్గాలన్న పట్టుదల వీడి అవతలి వ్యక్తులతో ఏకీభవించండి. ఉన్నతాధికారుల కదలికలపై నిజం ఉందన్న విషయాన్ని గమనించాలి. లౌక్యంతోనే మీ పనులు సానుకూలమవుతాయి. పెద్దల ప్రమేయంతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి రాగలవు. స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి, వస్త్రలాభం, ఆహ్వానాలు ఉంటాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-11-2024 శనివారం ఫలితాలు - శ్రమాధిక్యతతో లక్ష్యం సాధిస్తారు...

2025లో సింహ రాశి జాతకుల కెరీర్, వ్యాపారం ఇలా వుంటుంది..

శనివారం కాలాష్టమి: నల్ల శునకాలకు రొట్టెలు.. ఇప్పనూనెతో దీపం

2025 కర్కాటక రాశికి కలిసొస్తుందా? వృత్తి జీవితం ఎలా వుంటుంది?

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

తర్వాతి కథనం
Show comments