Webdunia - Bharat's app for daily news and videos

Install App

10-08-2020 సోమవారం రాశిఫలాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించి ...

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ, రంగంలోని వారికి పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు లా, ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలించవు. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం, పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. 
 
వృషభం : ఉపాధ్యాయులకు విద్యార్థులతో సంబంధాలు మరింత మెరుగుపడుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆడిటర్లు ఆసాధ్యమనుకున్న కేసులు సునాయాసంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్సుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులువుండవు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. 
 
మిథునం : ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీరంటే గిట్టని వారు మీకు చేరవయ్యేందుకు యత్నిస్తారు. స్త్రీలకు అయినవారి రాక సంతోషం కలిగిస్తుంది. బంధువుల మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. వ్యాపార, ఉపాధి పథకాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ఒక సమస్య పరిష్కారం కావడంతో మానసికంగా కుదుటపడతారు. ఫ్లీడర్లకు, ఫ్లీడర్ గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత, మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు నుంచి విముక్తి లభిస్తుంది. 
 
సింహం : వ్యవసాయ, తోటల రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, పనివారలతో చికాకులు తప్పువు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. కొంతమంది మిమ్మలను తప్పుదోవ పట్టించి లబ్దిపొందడానికి యత్నిస్తారు. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. 
 
కన్య : పోస్టల్, ఎల్.ఐ.సి., ఏజెంట్లకు పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. అధైర్యం వదిలి ధైర్యంతో ముందుకుసాగి జయంపొందండి. 
 
తుల : స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం లభిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు కలిసిరాగలదు. రాజకీయాలలో వారికి ఒక సమాచారం ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
వృశ్చిక : ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. గృహంలో ఏదైనా వస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. అనాలోచితంగా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
ధనస్సు : భార్య, భర్త మధ్య మనస్పర్థలు సమసిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. సంఘంలో పలుకుబడి గల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూమవుతాయి. అవసరానికి సన్నిహితులు ఆదుకుంటారు.
 
మకరం : స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. బ్యాంకు రుణాలు తీర్చడంతో పాటు కొంత రుణం తీసుకుంటారు.
 
కుంభం : ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. కోళ్ల, మత్స్యు, పాడి పరిశ్రమల్లో వారికి ఆందోళన తప్పదు. వృత్తుల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. బంధువుల మధ్య సయోధ్య లోపిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. 
 
మీనం : ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రయాణాల్లో అధిక శ్రమ ఎదుర్కొనక తప్పదు. బంధువులను కలుసుకుంటారు. వైద్యరంగాల్లోని వారికి ఆపరేషన్లు సమయంలో ఏకాగ్రత అవసరం. మీ మనోవాంఛ నెరవేరే సమయం అసన్నమయిందని గమనించండి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Girl Reels At Alipiri మోడ్రన్ దుస్తుల్లో కిస్సిక్ పాటకు రీల్.. సారీ చెప్పిన యువతి

YS Sharmila Sensational Comments జగన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు డబ్బులు అందాయా?

భూకంపం: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు జిల్లాలు తప్ప మిగతా ప్రాంతమంతా సేఫ్ జోన్‌లోనే’

ఎగిరే చేపలు.. తిమింగలం, గరుడ పక్షి నుంచి తప్పించుకుని.. (video)

"ఫ్యూచర్ సిటీ" కోసం.. 30వేల ఎకరాల భూమిని సేకరించాలి: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేస్తే అంతే సంగతులు.. టీటీడీ

01-12-2024 ఆదివారం ఫలితాలు - అనుభవజ్ఞుల సలహా పాటించండి...

01-12-2024 నుంచి 07-12-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

01-12-2024 నుంచి 31-12-2024 వరకు మీ మాస ఫలితాలు

30-11-2014 శనివారం వారం ఫలితాలు : సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments