Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశిఫలితాలు (సోమవారం) : మిత్ర బృందాలతో జర జాగ్రత్త

మేషం : ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు టీవీ, చానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. రావలసిన ధన చేతికందుతుంది. రాజకీయ నేతలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెట్టుబడుల వి

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (08:49 IST)
మేషం : ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు టీవీ, చానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. రావలసిన ధన చేతికందుతుంది. రాజకీయ నేతలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఏమాత్రం పొదుపు సాధ్యం కాదు. 
 
వృషభం : వ్యాపారాల్లో కొనుగోలుదార్లు, పనివారలను ఓ కంట కనిపెట్టుకోవడం ఉత్తమం. వాహన చోదకులకు జరిమానాలు, మరమ్మతులు వంటి చికాకులు ఎదురవుతాయి. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. 
 
మిథునం : యాధృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీపై సెంటిమెంట్లు, ఎదుటివారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలతో అతిగా సంభాషించడం వల్ల అపార్థాలకు గురికావలసి వస్తుంది. 
 
కర్కాటకం : శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులపై దృష్టిసారిస్తారు. రావలసిన ధనం వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. 
 
సింహం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టతరమవుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిదికాదు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందించి ఆదుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు.
 
కన్య : గతంలో నిలిపివేసి వ్యాపారాలు, పనులు పునః ప్రారంభించడానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఉత్సాహం, ఏకాగ్రత ఏర్పడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.
 
తుల : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు కలిసివస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, కుటుంబ సౌఖ్యం, తరచూ విందు భోజనాలు వంటి శుభ సంకేతాలుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం : రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి. నిరుద్యోగులు గడిచిన కాలం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పత్రిక, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. బంధువుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి.
 
ధనస్సు : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. పాత మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
మకరం : వైద్య శిబిరంలోని వారు తరచూ ఒత్తిడులకు గురవుతారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోతుంది. దీంతో ఆందోళన చెందుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి.
 
కుంభం : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సన్నిహితులతో కలిసివిందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
మీనం : విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ ఆభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీ మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రావలసిన ధనం వాయిదాపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లిస్తాం: వైసిపి మాజీ మంత్రి రోజా

YS Jagan: జగన్ పుట్టినరోజు బ్యానర్‌లో అల్లు అర్జున్ ఫోటో.. (వీడియో)

రీల్స్ కోసం.. శునకాన్ని ఆటోపై ఎక్కించుకుని తిరిగాడు.. (Video)

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments