Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-09-2016 దినఫలాలు...

మేషం : సభలు సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనం ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. ని

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (06:26 IST)
మేషం : సభలు సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనం ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలివైన లక్షణం.
 
వృషభం : పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు సంపాదన పట్లు ఆసక్తి అవకాశం కలిసివస్తాయి. రుణాలు చేబదుళ్లకు యత్నాలు సాగిస్తారు. ప్రముఖుల కలయిక అనుకూలించదు.
 
మిధునం : ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుట వల్ల ఆందోళన పెరుగుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారిక ఒత్తిడి, పనిభారం తప్పవు. చిన్నచిన్న అవకాశాలు కూడా వదిలిపెట్టకండి. బంధువులను కలుస్తారు. ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి స్తుంది. ఇతరుల ప్రభావం మీపై లేకుండా చూసుకోండి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ప్రేమలో పరాజయం మిమ్మల్ని కాస్త బాధిస్తుంది. మీ శక్తి యుక్తుల్ని వినియోగించే విధానాన్ని నేర్చుకుంటారు. దుష్ట శక్తులు తొలగిపోతాయి. 
 
సింహం : వ్యాపారాలు విస్తరింపజేస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల తోడ్పాటు లభిస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
కన్య : ఆర్థిక పరిస్థితి బాగుగా మెరుగుపడుతుంది. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థులకు స్నేహ బంధాలు విస్తరిస్తాయి. వైద్యులకు ఒత్తిడి, ఆటంకాలు వంటివి తప్పవు. పెద్దలు ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. 
 
తుల : హోటల్, తినుబండారాల వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రేమ విషయంలో మీ ఆలోచనలు కాస్త అస్తవ్యస్తంగా అయ్యే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. ఆత్మీయులను విమర్శించుట వల్ల చికాకులు తప్పవు. రుణం కొంత మొత్తం తీర్చడంలో ఒత్తిడి నుంచి కుదుటపడుతారు. 
 
వృశ్చికం : ఆలయ సందర్శనాలలో ఒత్తిడి తప్పదు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మీయులను విమర్శించుట వల్ల చికాకులు తప్పవు. కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసి వచ్చే కాలం. 
 
ధనస్సు : ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కావస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసినా సత్ఫలితాలు పొందుతారు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. 
 
మకరం : కొంతమంది మీ మాట, సహాయం అర్థిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటకి వ్యక్తం చేయకండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలో అనుకూలత, కొత్త అనుభూతులకు లోనవుతారు.  
 
కుంభం : మితిమీరిన ఆలోచనలు మీ మనసును వ్యాకుల పరుస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. 
 
మీనం : ఆర్థక విషయాల్లో అనుకున్నంత సంతృప్తి కానరాదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. భాగస్వామిక చర్చలలో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. సిమెంట్, ఇటుక, కలప వ్యాపారస్తులకు పురోభివృద్ధి. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments