Webdunia - Bharat's app for daily news and videos

Install App

16-08-2018 - గురువారం మీ రాశి ఫలితాలు.. స్త్రీలకు ఔషధ సేవనం తప్పదు..

మేషం: ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలబడుతారు. కాంట్రాక్టర

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (09:42 IST)
మేషం: ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలబడుతారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత, పర్యవేక్షణ ఎంతో అవసరం.
 
వృషభం: దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆనాలోచిత నిర్ణయాల వలన కుటుంబలంలో కలతలు తప్పవు. ఉపాధ్యాయులకు పై అధికారుల నుండి సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. విద్యార్థులు మెుండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. 
 
మిధునం: పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడడం మంచిది.  
 
కర్కాటకం: ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం శ్రేయస్కరం. ప్రేమికులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. మీ పొరబాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. సైన్స్, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. 
 
సింహం: ఉద్యోగస్తుల స్థానమార్పిడి యత్నానికి కొంతమంది అడ్డు తగిలే ఆస్కారం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. 
 
కన్య: స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పదు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల నిర్ణయాన్ని శిరసావహిస్తారు. దైవ సదర్శనాలలో కొంత ఆలస్యమవుతుంది. విలువైన వస్తువులు ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. మీ తొందరపాటు తనం వలన వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. 
 
తుల: వైద్య రంగాలవారికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీ అనుకూలిస్తాయి. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. పనిచేసే చోట అధికారులు మీ సామర్ధ్యాన్ని గుర్తిస్తారు.
 
వృశ్చికం: ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిదని గమనించండి. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతుల చేపడతారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
ధనస్సు: అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులెదుర్కుంటారు. వాయిదాపడిన పనులు అనుకోకుండా పూర్తిచేస్తారు. ప్రముఖుల పరిచయాలు, పాతమిత్రుల కలయిక మీ ఉన్నతికి దోహదపడుతాయి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలుచేస్తారు. 
 
మకరం: విద్యుత్ రంగాలవారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ముఖ్యులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. 
 
కుంభం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి పనివారలతో సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
మీనం: కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దైవ, ఆరోగ్య విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాతావరణంలోని మార్పు రైతులకు కొత్త ఉత్సాహం కలిగిస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments