Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ రాశి ఫలితాలు (09-07-17) : దైవ కార్యాల్లో పాల్గొంటారు...

మేషం: వృత్తి పనుల కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తితోపాటు అవకాశం కలిసివస్తుంది. దూర ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వ

Webdunia
శనివారం, 8 జులై 2017 (23:31 IST)
మేషం:
వృత్తి పనుల కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తితోపాటు అవకాశం కలిసివస్తుంది. దూర ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం.
 
వృషభం
మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. మీ ఆలోచనలు కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. 
 
మిథునం 
ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఎంతో శ్రమించిన మీదటగానీ అనుకున్న పనులు పూర్తికావు. వీలైనంత వరకు బయట ఆహారాన్ని భుజించకండి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం 
పొదుపు చేయాలనే ప్రయత్నం ఫలించదు. కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసరవస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఆలోచనలు ఉపాధి పథకాలు దిశగా సాగుతాయి. మిత్రుల ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
సింహం
ఉద్యోగస్తులకు విశ్రాంతి లభించడంతో వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపన వల్ల ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.
 
కన్య
విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సన్నిహితుల సహాయంతో పనులు చక్కదిద్దుతారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. వైద్యులకు ఆపరేషన్లలో ఏకాగ్రత అవసరం. దైవ, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
తుల 
ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామిక వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. గతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయమై న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం
మీ జీవితం మీరు కోరుకున్నట్టుగానే ఉంటుంది. స్పెక్యులేష్ రంగాల వారి అంచనాలు తారుమారవుతాయి. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. ఏ యత్నం కలిసిరాకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. విందులలో పరిమితి పాటించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
ధనస్సు
సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. విలువైన వస్తువులు ఏర్పరచుకోవాలనే స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సభాసమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం 
ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధవహించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ సంతానంపై చదువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. 
 
కుంభం
ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అనుకున్నది సాధించగలనన్న ఆత్మవిశ్వాసం నెలకొంటుంది. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మీనం 
స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. బంధుమిత్రులను కలుసుకుంటారు. కోళ్ళ, మత్స్యు, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments