Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి రాశిఫలాలు(25-06-2017)... విద్యార్థులు బజారు తినుబండారాలు తినొద్దు..

మీనం : చిన్నారులు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు బజ

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (19:10 IST)
మేషం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలనే పట్టుదల అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకైనా అందుతుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
వృషభం : ప్రయాణాలు, ముఖ్యమైన చెల్లింపుల్లో మెలకువ వహించండి. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వుంటుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్నిస్తుంది.
 
మిథునం : ఆదాయం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. విహారయాత్రలకు అవకాశాలున్నాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సాహస ప్రయత్నాలు విరమించండి. మీ సంతానం, ఆప్తుల కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు.
 
కర్కాటకం : మొక్కుబడులు, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు. మీ యత్నాలకు ఆత్మీయులు సహాయ సహకారాలు అందిస్తారు. బంధు మిత్రుల రాకపోకలు అధిక ఖర్చులు, మీ అంచనాలు దాటుతాయి. 
 
సింహం : మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. మీ కళత్రి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య : ప్రేమ విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ ఓ త్యాగం చేయాల్సి వస్తుంది. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులు తప్పవు. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవడానికి బాగా శ్రమించాలి. సంగీత, సాహిత్య సదస్సుల్లో పాల్గొంటారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
తుల : ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సోదరి, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొత్త వ్యాపారాల ఆలోచన మాని చేస్తున్న వాటిపై దృష్టి పెట్టండి.
 
వృశ్చికం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కానివేళల్లో మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించండి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. శత్రువులపై విజయం సాధిస్తారు.
 
ధనుస్సు : మీ సంతానం మొండివైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలు అందరి యందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం ద్వారా సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.
 
మకరం : ఆదాయపు లెక్కలు, తేడాలు అప్పటికప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం.
 
కుంభం: స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలనే పట్టుదల అధికమవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విపరీతంగా వ్యయం చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. విదేశీ చదువుల యత్నంలో విద్యార్థులు సఫలీకృతులవుతారు.
 
మీనం : చిన్నారులు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం ద్వారా అస్వస్థతకు లోనవుతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

'ఫెంగాల్' : దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో భారీ వర్షాలు

హైడ్రాకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్.. రంగనాథ్ ప్రకటన

ములుగు జిల్లాలో కాల్పులు.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments