Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాసగిరులను చీల్చుతూ చైనా రైలు మార్గం... అందుకేనా నేపాల్‌కు భూ విలయం..?!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (16:12 IST)
హిమాలయా పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రాంతమే నేపాల్. ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యంగా వెలుగొందిన నేపాల్.. దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దుల్లో ఉంది. నేపాల్ ఓ లాండ్ లాక్ దేశంగా పిలువబడుతోంది. నేపాల్‌కు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనే జాతికి సంబంధించినవారు 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చారు. ఇదే నేపాల్ చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. 
 
గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో పాటు ఇప్పటి నేపాల్‌లోని దక్షిణ ప్రాంతాలను (హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. 
 
నేపాళ దేశమున నాగవాసమనే పేరుగల గొప్ప సరోవరము ఉండేదనీ.. ఈ సరోవరంలో కర్కోటకుడైన నాగరాజూ పరిపాలించేవాడని పురాణాలు చెపుతాయి. ఆ కాలములో నాగసరోవరము లోపల ఒక తామర మొక్క అయినా మొలవక పోవడంతో.. చాలా కాలము క్రిందట విందుమతీ నగరము నుండి విపస్య బుద్దుడు ఈ సరోవరమునకు వచ్చి అతడో తామర మొక్కను మంత్రించి ఈ సరోవరమున పారవేస్తూ... "ఈ తామర పుష్పించిన నాడు బుద్ద భగవానుడు జ్యోతి వలె భక్తులకు కనపడున''ని చెప్పి వెళ్లిపోయాడట.
 
ఈ కారణము చేత స్యయంభూనాధ్, బోద్ద్‌నాధ్ దేవాలయముల్లో జ్యోతి ఎల్లప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఈ బోధిసత్వుడినే కొందరు "మంజుశ్రీ" అని పిలుస్తారు. ఈ మంజుశ్రీ అనే వాడు కొందరు చైనా దేశీయుడని, మరికొందరు ఆంధ్రుడని చెపుతారు.
 
 
నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాలా పవిత్రమైనవి. నేపాల్‌లోనే అనుకున్న కోరికలు తీర్చే మనోకామన ఆలయం ఉంది. అమ్మవారు ఇక్కడ కొలువై వున్నారు. అలాగే సుప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం కూడా నేపాల్‌లోనే ఉంది. వీటితో పాటు మహావిష్ణు ఆలయం, ముక్తినాథ ఆలయం, సూర్యోదయ వీక్షణ, భక్తాపూర్ వంటి ప్రాంతాలు పర్యాటకులను, యాత్రికులకు బాగా ఆకట్టుకుంటాయి. ఇంతకీ నేపాల్‌కు సంబంధించిన ఈ చరిత్ర అంతా ఎందుకంటే.. నేపాల్ భూకంపం సంభవించేందుకు నేపాల్ దేశం చైనాతో కలిసి చేయతలపెట్టిన ఓ కార్యమే కారణమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
చైనా హిమాలయాల మార్గం ద్వారా.. పవిత్రంగా చెప్పుకునే కైలాస గిరులను తొలుస్తూ సొరంగ మార్గం ద్వారా నేపాల్‌కు రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించడం.. అందుకు నేపాల్ దేశం కూడా తలూపడమే నేపాల్‌లో భారీ భూకంపం.. భారీ విలయానికి కారణమని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హిందూ దేశంగా విరాజిల్లుతున్న నేపాల్ దేశంలో.. ఆదిశంకరుడు, పరమేశ్వరుడు కొలువై వుంటారని భక్తులు విశ్వసిస్తున్న హిమాలయ పర్వతాన్ని తవ్వి సొరంగ మార్గం ద్వారా చైనా రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవడమే నేపాల్ ప్రజలకు తీరని కష్టాలు తెచ్చిపెట్టాయని వారు వాదిస్తున్నారు. 
 
ప్రపంచ దేశాల్లో హిందూ దేశంగా నేపాల్, కైలాస గిరులుగా హిమాలయాలు పేరొందిన తరుణంలో.. ప్రకృతితో చైనా ఆటాడుకోవాలని చూసింది. అంతేగాకుండా హిమ కొండల్ని చీల్చి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే నేపాల్ ప్రజలకు అరిష్టం తెచ్చిపెట్టిందని.... అందుకే భూకంపంతో నేపాల్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే నేపాల్ ప్రజలు ప్రకృతి కోపానికి కారణమవ్వాల్సి వచ్చిందని జ్యోతిష్య పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

Show comments