Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుబేరుడితో లక్ష్మీపూజ ఎందుకు? (video)

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (19:13 IST)
సిరిసంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడిని చేర్చి పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే శ్రీ లక్ష్మీకుబేర పూజ ద్వారా అనుకున్నది సాధిస్తారని సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీని మాత్రమే పూజించకుండా శ్రీకుబేర లక్ష్మీ పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. 
 
ఇందుకు దీపావళి రోజు ఉత్తమం. శ్రీ మహాలక్ష్మీ దేవి శ్రీమంతుడి గుండెల్లో కొలువై వుంటుంది. అలాంటి దేవి.. దీపావళి రోజున మన ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకే ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ముందే లక్ష్మీకుబేర పూజ చేయడం మంచిది. ఇంటిల్లిపాదిని దీపాలతో అలంకరించి.. లక్ష్మీదేవికి ఆహ్వానం పలికి పూజించినట్లైతే విశేష ఫలితాలుంటాయి. 
 
ఇక కుబేరుడు త్రేతాయుగం.. శ్రీముఖ సంవత్సరం, ధనుస్సు రాశిలో జన్మించినట్లు చెప్తారు. శివభక్తుడైన కుబేరుడు.. దేవరాజు ఇంద్రునికి తగ్గినట్లు పుష్పక విమానంలో ప్రయాణించే హోదాను కలిగివుంటాడు. శివుని అనుగ్రహంతో సంపదలకు అధిపతిగా మారాడు. అలాంటి కుబేరుడిని.. లక్ష్మీదేవితో పాటు పూజించే వారికి సమస్త దోషాలుండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments